‘చెక్’ మూవీ రివ్యూ: నితిన్ ‘చదరంగం’!

చంద్రశేఖర్ ఏలిటి సినిమా అంటే.. కంటెంట్‌కి కొదువ ఉండదు. ‘ఐతే’.. ‘అనుకోకుండా ఓరోజు’.. ‘ఒక్కడున్నాడు’.. ‘ప్రయాణం’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో వెర్సటైల్ డైరెక్టర్ అనిపించుకున్నారాయన. వీటిలో ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’.. ఇలాంటి ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే చంద్రశేఖర్ ఏలేటి‌కి కమర్షియల్ సక్సెస్ లేదు. కథలో కంటెంట్ ఉన్నా.. కమర్షియల్ సక్సెస్‌తో గుర్తింపు సాధించలేకపోయారు చంద్రశేఖర్ ఏలేటి. లాంగ్ గ్యాప్ తరువాత కల్ట్ హీరో నితిన్‌తో బాక్సాఫీస్‌కి ‘చెక్’ పెట్టేందుకు చెక్ సినిమా రూపొందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. ట్రైలర్, టీజర్‌లతో పాటు ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలోనూ ఈ సినిమా కథను ముందే రివీల్ చేశారు. ఉరిశిక్ష పడ్డ టెర్రరిస్ట్ ‘చెస్’లో విశ్వ విజేత అయ్యి తన ఉరిశిక్షకు ఎలా ‘చెక్’ పెట్టాడు అన్నదే ఈ సినిమా. నగరంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో 40 మంది చనిపోతారు. ఆ కేసులో చేయని నేరానికి ఆదిత్య (నితిన్)కు ఉరిశిక్ష పడుతుంది. ఆ శిక్ష నుంచి బయటపడే అన్ని దారులు మూసుకుపోవడంతో క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తుంటాడు ఆదిత్య. అదే టైంలో జైలులో శివన్నారాయణ (సాయి చంద్).. ఆదిత్యలోని టాలెంట్‌ని గుర్తించి చెస్ నేర్పుతాడు. జైలు నుంచే ఒక్కో మెట్టు ఎక్కుతూ విశ్వ విజేత అవుతాడు ఆదిత్య. అయితే రాష్ట్రపతి క్షమాభిక్ష లభించి.. ఆదిత్య జైలు నుంచి బయటకు వస్తాడనుకునే టైంలో కథలో ఊహించని ట్విస్ట్ ఎదురౌతుంది. దీంతో ఆదిత్య ఉరిశిక్ష విధించే టైం దగ్గర పడుతుంది. ఆ టైంలో ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు? అతనికి లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్) ఏవిధంగా సాయపడింది? తన ప్రేయసి యాత్ర (ప్రియా ప్రకాష్ వారియర్) వల్ల ఆదిత్య జీవితం జైలు గోడలకు ఎలా పరిమితం అయ్యింది? అన్నదే మిగిలిన కథ. డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాలు తీయడంతో చంద్రశేఖర్‌ యేలేటి మాస్టర్‌. అలాంటి మాస్టర్ మెదడులో నుంచి ఓ అంతర్జాతీయ చెస్ మాస్టర్ కథ పుట్టుకొచ్చింది. సస్పెన్స్.. మైండ్ గేమ్‌‌.. ఇంటిలిజెన్స్‌తో తన మార్క్ చూపిస్తూ కథను ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు దర్శకుడు. తనలో ఓ చెస్ క్రీడాకారుడు ఉన్నాడని గుర్తించే సీన్లు.. జైలు నుంచి నేషనల్ ఛాంపియన్ షిప్ గెలవడం.. అతని ఫ్లాష్ బ్యాక్ అంతా పకడ్బందీగానే నడిపించారు. కథ ముందే రివీల్ అయినా కథనాన్ని ఆసక్తికరంగానే నడిపించారు. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఓ కొత్త నితిన్‌ని చూపించారు. ఇద్దరు హీరోయిన్లను కూడా గ్లామర్ డాల్స్‌ చూపించకుండా కథకు ఎంతవరకూ అవసరమో అంతవరకే ఉపయోగించుకున్నారు. అయితే ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి కథ గాడితప్పడంతో పాటు.. వాస్తవపరిస్థితులకు దూరం అయ్యింది. క్రైమాక్స్‌లో చంద్రశేఖర్ ఏలేటి మార్క్ మిస్ అయ్యిందేమో అనిపిస్తుంటుంది. ఉరిశిక్ష పడ్డ ఉగ్రవాది ఖైదీ జైలు నుంచి తప్పించుకోవడమే పెద్ద టాస్క్ అయితే.. సొరంగం తవ్వి మరీ జైలు నుంచి బయటపడటం అనేది కన్వెన్సింగ్‌గా అనిపించదు. అయితే పాత్రల ఎంపిక.. వారిని ప్రజెంట్ చేసిన తీరు బాగానే ఉన్నా చాలా చోట్ల లాజిక్‌లు మిస్ అయినట్టే కనిపిస్తాయి. ఈ సినిమాతో హీరో నితిన్ నటుడిగా విలక్షణ పాత్రను ఎంచుకున్నాడు. జయం తరువాత ఎక్కువ టేక్‌లు తీసుకున్న సినిమా ఇదే అని ముందే చెప్పాడు నితిన్. ఆ టేక్‌లు ఈ పర్ఫెక్షన్ కోసమేనా అనేట్టుగా చేశాడు నితిన్. తనలోని ఓ కొత్త నటుడ్ని చూపించాడు. సినిమా మొత్తం జైలులోనే ఉండటంతో నితిన్ ఒకేరకం క్యాస్ట్యూమ్స్‌తో కనిపిస్తాడు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. తనలో ఆత్మ స్థైర్యం నింపుకుని గ్రాండ్ మాస్టర్ అయ్యే పాత్రలో ఒదిగిపోయాడు. ప్రియా వారియర్‌తో లవ్ ట్రాక్‌లో లవర్ బాయ్‌గానూ ఆకట్టుకున్నాడు. నటుడిగా నితిన్‌కి‌ మంచి గుర్తింపుతెచ్చే పాత్ర అయితే చెక్ చిత్రం ద్వారా లభించింది. ఇక హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్.. తొలిసారి గ్లామర్ హంగుల్ని పక్కన పెట్టి క్యారెక్టర్ స్కోప్‌ ఉన్న పాత్రలో నటించింది. లాయర్ మానసగా ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. హీరోతో రొమాన్స్.. సాంగ్స్ లాంటి వాటికి ఈ సినిమాలో స్కోప్ లేకపోవడంతో కేవలం లాయర్ అనే క్యారెక్టర్‌కి పరిమితం అయ్యింది రకుల్. మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. స్క్రీన్ మీద కనిపించినంతసేపూ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ‘నిన్న చూడలేక’ సాంగ్‌లో వింక్ బ్యూటీ కనుల విందు చేసింది. కథలో ఆమెకి కీలకమైన నేపథ్యం ఉండటంతో వింక్ బ్యూటీకి మంచి రోల్ పడిందనే చెప్పాలి. ఉప్పెన సినిమాలో హీరో తండ్రిగా అద్భుత నటనతో ఆకట్టుకున్న దేవి ప్రసాద్.. ఈ సినిమాలో నితిన్ గురువుగా మరోసారి మెస్మరైజ్ చేశాడు. కథ పుంజుకునేది ఆయన పాత్రతోనే. తన సీరియారిటీని శివన్నారాయణ పాత్రతో మరోసారి ప్రేక్షకులకు రుచిచూపించాడు. జైలు అధికారులుగా మురళీశర్మ, సంపత్‌ రాజ్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఈ తరహా పాత్రల్లో చాలాసార్లు కనిపించడంతో కొత్తగా అనిపించవు. పైగా నితిన్ ‘భీష్మ’ చిత్రంలో సంపత్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించడంతో పోలిక తప్పనిసరే అనిపిస్తుంది. టెక్నికల్ పరంగా.. వివేక్ అన్నమలై ఆర్ట్ సినిమాకి ఓ కొత్త లుక్ తీసుకువచ్చింది. జైలు సన్నివేషాలు రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. ఎమ్. నరేష్ రెడ్డి మాటలు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. చాలాచోట్ల వేదాంతం వినిపించినట్టుగానే అనిపిస్తాయి. కళ్యాణ్ మాలిక్ రీ రికార్డింగ్‌ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. కథకు తగ్గట్టుగా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. రాహుల్ శ్రీ వాత్సవ్ ఫొటోగ్రఫీ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు జైలు సన్నివేషాలు బాగా చూపించారు. మొత్తంగా చెక్ మాస్టర్ పీస్ మూవీ కాదు కానీ.. ఓ మంచి ప్రయత్నం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చుతుంది. చంద్రశేఖర్ యేలేటి మార్క్ కనిపించినా బాక్సాఫీస్‌కి చెక్ పెట్టే రేంజ్‌లో అయితే ఈ ‘చెక్’ లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qZ9bC5

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts