టాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక తహతహలాడుతున్నారు. విలక్షణ పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా 'బంగారు బుల్లోడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఇప్పుడు ప్రయోగాత్మక సినిమా 'నాంది'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లరోడు. ఫిబ్రవరి 19వ తేదీన ఈ సినిమా విడుదలైంది. పోటీలో వేరే సినిమాలున్నా ఈ సినిమా వసూళ్ల వేట కొనసాగుతూనే ఉంది. టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నప్పటికీ మొదటి రోజు పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు 'నాంది'. అయితే తొలిరోజు సినిమా చూసిన ఆడియన్స్ నరేష్ నటనపై, కథలో ఉన్న స్టఫ్‌పై పాజిటివ్ టాక్ కామెంట్స్ చేయడంతో వరుసగా రెండు, మూడు రోజుల్లో కలెక్షన్స్ పుంజుకున్నాయి. వీకెండ్ కావడంతో అల్లరోడి థియేటర్స్ వెతుక్కుంటూ వెళ్లారు ఆడియన్స్. ఇక ఆ తర్వాత సోమవారం అంటే నాలుగో రోజు కూడా అదే హవా కంటిన్యూ అయింది. 4 వ రోజు సాధించిన కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా వెళ్ళింది 'నాంది' సినిమా. కొన్ని ఏరియాల్లో అయితే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కి ఒక్క అడుగు దూరంలో ఉన్న అల్లరోడు నేటి కలెక్షన్స్‌తో ఆ ఫీట్ దాటేస్తాడని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. నాలుగో రోజు కలెక్షన్ల వివరాలు చూస్తే.. నైజాం-18 లక్షలు సీడెడ్- 8 లక్షలు ఉత్తరాంధ్ర- 4.4 లక్షలు ఈస్ట్ గోదావరి- 3.3 లక్షలు వెస్ట్ గోదావరి- 2.5 లక్షలు గుంటూరు- 3.9 లక్షలు కృష్ణా- 3.7 లక్షలు నెల్లూరు- 2.1 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి చూస్తే నాలుగో రోజుకు గాను 46 లక్షల షేర్, 85 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. 3 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన 'నాంది' మూవీ టోటల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా తొలి నాలుగు రోజుల్లో 2.75 కోట్లు వసూలు చేసింది. సో.. మరో 25 లక్షలు రాబడితే అల్లరోడి ఖాతాలో క్లీన్ హిట్ పడ్డట్టే మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37GGkeb
No comments:
Post a Comment