దర్శకధీరుడు రూపొందిస్తున్న భారీ సినిమా . డీవీవీ దానయ్య నిర్మాణంలో 400 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందిస్తున్నారు. చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ కోసం తన రెగ్యులర్ పంథా లోనే వెళ్తున్నారు రాజమౌళి. ఎంత ఆలస్యమైనా అవుట్‌ఫుట్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. ఈ కారణంగా ఇప్పటికే ఓ సారి విడుదల తేదీని వాయిదా వేసి జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తేవాలని ఫిక్స్ అయ్యారు. 80 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేశాక.. ఇంతలో లాక్‌డౌన్ రావడం, షూటింగ్స్ వాయిదా పడటంతో మిగిలిన భాగం పెండింగ్‌లో పడిపోయింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అనేది అంతా ఈజీ కాదనే టాక్ బయటకు వచ్చింది. రాజమౌళి మరోసారి విడుదలను వాయిదా వేయొచ్చనే వార్తలు వచ్చాయి. సమ్మర్‌కు పోస్ట్ పోన్ చేయొచ్చని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వాటికి చెక్ పెట్టేలా జక్కన్న ఓ ప్లాన్ చేశారని తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న భాగాన్ని కొంతమేర మార్పు చేసి త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఈ మేరకు భారీ యాక్షన్ సీన్స్, అవుడ్ డోర్ షెడ్యూల్స్ సీన్స్ విషయంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్‌తో చర్చలు కూడా ముగిశాయని, అందుకు తగ్గట్లుగా ప్రణాళిక రచించారని తెలుస్తోంది. షూటింగ్స్ ఓపెన్ కాగానే త్వరత్వరగా ఫినిష్ చేసి జనవరి 8నే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. కొద్దిగా మార్పులు చేసినా సినిమాపై పెద్దగా ప్రభావం ఉండదనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ న్యూస్ మెగా, నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36pC01c
No comments:
Post a Comment