గత సినిమా 'అల.. వైకుంఠపురములో' కమర్షియల్ గానే కాక మ్యూజికల్‌గా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. నేటికీ ఆ పాటలు దేశ సరిహద్దులు దాటి హోరెత్తిస్తున్నాయి. థమన్ బాణీలు మ్యాజిక్ చేసేశాయి. దీంతో అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా ''లో సాంగ్స్ ఎలా ఉండనున్నాయి? ఎలా ప్లాన్ చేశారు? పాటలపై క్రియేటివిటీ ఎంత మేర ఉండనుంది? అనే దానిపై ఫోకస్ పెట్టారు ఆడియన్స్. ఈ క్రమంలో సుకుమార్ కూడా మ్యూజిక్ వెయిటేజ్ సినిమాకు ప్లస్ కావాలని, గతంలో ఏ సినిమాలో లేని విధంగా 'పుష్ప' సాంగ్స్ చాలా స్పెషల్‌గా ఉండాలని భావిస్తున్నారట. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ అప్పియరెన్స్ అదరగొట్టేయనుందని ఫస్ట్‌లుక్ ద్వారానే తెలిసిపోయింది. దీంతో ఈ లాక్‌డౌన్ విరామ సమయంలో పుష్ప సాంగ్స్ పైనే కసరత్తులు చేస్తున్నారట సుక్కు. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే మొదట ఐటెం సాంగ్ షూట్ చేసి సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని చూస్తున్నారట. బన్నీ అభిమానులు ఊగిపోయేలా అల్లు అర్జున్‌తో హాట్ బ్యూటీ దిశా పటానీ ఈ సాంగ్‌లో రెచ్చిపోనుందని టాక్. గతంలో వచ్చిన స్పెషల్ సాంగ్స్ అన్నింటికీ భిన్నంగా జానపద నేపథ్యంలో ఈ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట సుకుమార్. షూటింగ్‌లో డాన్స్ ఫ్లోర్, విడుదలయ్యాక థియేటర్స్ దద్దరిల్లేలా ఈ సాంగ్ మేకింగ్ జరగాలని దేవీ శ్రీకి చెప్పారట. ప్యాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రాబోతుంది కాబట్టి అన్ని భాషల్లో మ్యూజిక్ స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉండాలని దేవీ శ్రీ, సుకుమార్ భారీ వర్కవుట్స్ చేస్తున్నారట. పుష్ప చిత్రంలో 5 పాటలు ఉండనున్నాయని, అన్నీ కూడా వేటికవే ప్రత్యేకంగా నిలుస్తూ గత రికార్డులను తిరగరాయడం ఖాయమే అని టాక్. Also Read: ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ఫినిష్ చేసుకొని లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ తదుపరి షెడ్యూల్స్ త్వరత్వరగా ఫినిష్ చేసి బన్నీ అభిమానుల ముందు మరో బిగ్గెస్ట్ హిట్ ఉంచాలని చూస్తున్నారు సుకుమార్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZhCchc
No comments:
Post a Comment