అంతా కరోనా మహమ్మారి మాయలో ఉండగా ఉన్నట్టుండి సడెన్ షాక్ ఇచ్చారు యంగ్ హీరో దగ్గుబాటి రానా. 'ఆమె ఎస్ అనేసింది' అంటూ ఏకంగా లవర్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. దీంతో ఇన్నాళ్లు ఎవ్వరికీ తెలియని టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లవ్ స్టోరీ బయటకొచ్చింది. అయితే ఇది ప్రేమ వరకేనా పెళ్లి కూడా చేసుకుంటారా? అనే దానిపై ఆలస్యం చేయకుండా వెంటనే క్లారిటీ ఇచ్చేశారు రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు. ఈ ఏడాదే రానా- మిహికా బజాజ్ ఒక్కటి కాబోతున్నారని అన్నారు. మరోవైపు రానా లవ్‌లో ఉన్నారని తెలిసి ప్రేక్షకలోకమంతా చాలా సంతోషంగా ఫీల్ అయినప్పటికీ.. మిహికా బజాజ్ ఎవరు? ఆమెతో రానాకు ఎలా పరిచయం ఏర్పడింది? అనే కోణంలో ఆరా దీయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో వెంకటేష్ కూతురు అశ్రిత పేరు బయటకొచ్చింది. మిహికా బజాజ్, వెంకీ కూతురు అశ్రిత బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని.. ఆ కారణం గానే మిహికాతో రానా పరిచయం జరిగిందని టాక్ నడుస్తోంది. అంతేకాదు రానా- మిహికా బజాజ్ ప్రేమ వ్యవహారం అశ్రితకు ముందే తెలుసని, ఆమె బాగా సపోర్ట్ చేసిందని ఫిలింనగర్ టాక్. Also Read: మిహికా బజాజ్ పక్కా హైదరాబాదీ. ఆమె తల్లిదండ్రులు బంటీ బజాజ్, సురేష్ బజాజ్. మొదటి నుంచే వీరిది ఉన్నతమైన ఫ్యామిలీ. మూడేళ్ల క్రితం వరకూ ఆమె హైదరాబాద్‌లోనే ఉండేది. చెల్సియా యూనివర్శిటీలో ఇంటీరియల్ రిజైన్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన మిహికా బజాజ్.. అనంతరం తన తల్లి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరించింది. ఆ తరువాత 2017లో సొంతంగా ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఈవెంట్ కంపెనీని స్థాపించి యంగ్ బిజినెస్ ఉమెన్‌గా సత్తా చూపిస్తోంది. ఒకవైపు తల్లి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ చూస్తూనే.. తాను సొంతంగా రన్ చేస్తున్న ఇంటీరియల్ డిజైన్ కంపెనీ బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది మిహికా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WyWH7y
No comments:
Post a Comment