ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునే ట్రీట్స్ రెడీ! అవే..

మరో రెండు రోజుల్లో నందమూరి అభిమానుల పండగ రోజు రాబోతోంది. నందమూరి నట వారసుడు, యంగ్ టైగర్ మే 20న తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అటు అభిమానులు, ఇటు సినీ దర్శకనిర్మాతలు యమ హుషారెత్తిపోతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే రోజున స్పెషల్ ట్రీట్స్ ఉండాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. ఈ మేరకు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూడు సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూడింటికి సంబంధించిన అన్ని పనులు పూర్తిచేసి రెడీగా పెట్టారని టాక్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ RRR. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్ రోల్ పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా చెర్రీకి సంబంధించిన వీడియో విడుదల చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపిన జక్కన్న.. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆయనకు సంబంధించి అదిరిపోయే ట్రీట్ రెడీ చేసి పెట్టారట. ఈ విషయాన్ని ఇటీవలే నిర్మాత దానయ్య కన్ఫర్మ్ చేశారు. దీంతో నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది. Also Read: దీనికి కొనసాగింపుగా అటు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇటు ప్రశాంత్ నీల్ కూడా వారి వారి సర్‌ప్రైజ్‌లతో నందమూరి అభిమానులకు కిక్కివ్వాలని చూస్తున్నారట. RRR (రౌద్రం రణం రుధిరం) తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉండనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందనున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని టాక్. నాడే ఈ టైటిల్ సీక్రెట్ రివీల్ చేస్తూ అధికారిక ప్రకటన చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. మరోవైపు ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రానుందంటూ జరుగుతున్న ప్రచారానికి కూడా ముగింపు పలికేలా ఓ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసి పెట్టారట. సో.. ఈ సారి ఎన్టీఆర్ పుటిన రోజున ఈ మూడు ట్రీట్స్‌తో నందమూరి అభిమానులు పండగ చేసుకోకున్నారన్నమాట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Tw30XJ

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts