అబద్దం తీపిగా ఉంటే, నిజం మాత్రం ఎప్పుడూ చేదుగానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం. కొన్ని సందర్బాలలో నిజం చెప్పినా కొందరు నమ్మరు. పైగా అబ్బో! బాగా మితిమీరి మాట్లాడుతుందిలే అనుకుంటారు. సరిగ్గా అదే విషయం చెబుతోంది బిగ్ బాస్ బ్యూటీ . ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న హరితేజ.. కాసేపు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ముచ్చటిస్తూ వాళ్ళడిగిన ప్రశ్నలకు ముక్కుసూటి సమాధానాలు చెప్పింది. అంతేకాదు మీరు నమ్మినా నమ్మకపోయినా తాను చెప్పింది నిజం అంటూ కుండబద్దలు కొట్టేలా మాట్లాడింది. లాక్‌డౌన్ కారణంగా సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా అంతా ఇంటికే పరిమితమై ఉన్నారు. ఈ ఖాళీ సమయంలో సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు సినీ తారలు. ఈ నేపథ్యంలో తన ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో టచ్ లోకి వచ్చిన హరితేజ.. తాను చేసిన పనులు, నిజాలు నిర్మొహమాటంగా ఒప్పుకుంది. మేడమ్ మీరు 'హిట్' సినిమాలో చేసిన షీలా పాత్ర బాగుంది. అయితే ఆ సినిమాలో మీరు నిజంగానే సిగరెట్ కాల్చారా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది హరితేజ. అవును! 'హిట్' సినిమాలో నిజంగానే సిగరెట్ కాల్చా అని సింపుల్‌గా ఒప్పేసుకుంది. ఆ సన్నివేశం, పాత్ర డిమాండ్ చేయడం వల్ల తప్పలేదని, రియాలిటిక్‌గా ఉండాలంటే తప్పదనే అలా చేశానని చెప్పుకొచ్చింది. ఇకపోతే మీ వయసెంత మేడమ్? అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నపై ఆమె స్పందిస్తూ.. మీకు చెప్పినా వేస్ట్, మీరు ఎలాగూ నమ్మరు. అయినా చెబుతున్నా అంటూ తాను 24వ తేదీ ఫిబ్రవరి 1992 సంవత్సరం జన్మించానని చెప్పింది. దీంతో ఆశ్చర్యపోవడమే నెటిజన్స్ వంతైంది. బుల్లితెర, వెండితెర ప్రయాణం సాఫీగా సాగిస్తున్న హరితేజ.. బిగ్ బాస్ షో ద్వారా బాగా ఫేమస్ అయింది. బిగ్ బాస్ బ్యూటీగా ఆమెకు మంచి పాపులారిటీ చేకూరింది. ఓ వైపు సినిమా చేస్తూనే, యాంకర్‌గా, పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా అదరగొట్టేస్తోంది హరితేజ. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VU14JR
No comments:
Post a Comment