తెలుగు సినిమాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న 25 సినిమాలు పూర్తిచేశాక రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు పవన్. దీంతో ఇక ఆయన సినిమాలు చూడలేమేమో అనుకున్నారు మెగా ఫ్యాన్స్. కానీ నిర్మాతల కోరిక మేరకు అనూహ్యంగా తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్.. ముందుగా '' సినిమా ఒప్పుకున్నారు. ఆ తర్వాత వరుసగా మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టారు. బాలీవుడ్ మూవీ 'పింక్' సినిమాకు రీమేక్‌గా రాబోతున్న ‘వకీల్ సాబ్’ మూవీ ఇప్పటికే 80 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని ఫినిష్ చేసి మే 15న విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. ఇంతలో ఈ ప్లాన్‌ని కరోనా మహమ్మారి కాటేసింది. లాక్‌డౌన్ రావడంతో షూటింగ్స్ వాయిదాపడి మెగా అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. కాగా ఇప్పుడు ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తుంది కాబట్టి వచ్చే నెలలోనే షూటింగ్స్‌కి పర్మిషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన 'వకీల్ సాబ్' సినిమా విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారట. కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్నందున ఒకవేళ షూటింగ్స్ పర్మిషన్ లభించినా కూడా జులై నుంచే సెట్స్ పైకి రావాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయం నిర్మాతకు చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. వైరస్ వ్యాప్తి కొంతైనా అదుపులోకి రాకుండా సెట్స్ మీదకు రావడం సరైంది కాదని పవన్ భావిస్తున్నారట. మరోవైపు అతిత్వరలో వకీల్ సాబ్ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని గట్టి పట్టుదలతో ఉన్నారట పవన్ కళ్యాణ్. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లలో నివేదా థామస్ రోల్ సినిమాకు హైలైట్ కానుందని తెలుస్తోంది. మరో ముఖ్యపాత్ర కోసం జాన్వీ కపూర్‌ని తీసుకుంటున్నారని టాక్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2AbyhYN
No comments:
Post a Comment