గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో యంగ్ హీరోల పెళ్లి సంగతులు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే నిఖిల్ పెళ్లి చేసుకోగా.. మరో హీరో పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే షాలినితో నితిన్ మ్యారేజ్ జరగనుంది. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు.. వరుణ్ తేజ్ పెళ్లిపై స్పందిస్తూ త్వరలోనే వరుణ్ మ్యారేజ్ చేస్తామని అన్నారు. అలాగే మెగా మేనల్లుడు సైతం టైమ్ వస్తే పెళ్లి కావొచ్చేమో అనే హింట్ ఇచ్చాడు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్.. ''నో పెళ్లి'' సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలోని ఈ పాటను నితిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేస్తూ ఓ కామెంట్ చేశారు. ఈ సినిమా నుంచి సాంగ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉదంటూనే.. పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉంటావో నేనూ చూస్తానని సాయి ధరమ్ తేజ్‌ని ఉద్ధేశించి సరదా వ్యాఖ్యలు చేశాడు నితిన్. ''కొన్ని సార్లు చేసుకోవడంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమోగానీ చేసుకోవడం మాత్రం పక్కా'' అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు. Also Read: దీనిపై వెంటనే స్పందించిన సాయి ధరమ్ తేజ్.. ''నేను ట్రెండ్ ఫాలో అవ్వను బ్రదర్, ట్రెండ్ సెట్ చేస్తా'' అంటూ జబర్దస్త్ రియాక్షన్ ఇచ్చాడు. అదేవిధంగా ‘మింగిల్ అయినా మా లాంటి సింగిల్స్ కోసం ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు థ్యాంక్యూ డార్లింగ్’ అని పేర్కొంటూ నితిన్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్ తెలియజేశాడు. ఈ యంగ్ హీరోల ట్వీట్ సంభాషణ తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా విషయానికొస్తే.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందింది. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. మే 1వ తేదీన విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZDIQia
No comments:
Post a Comment