దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ‘F2’. ఈ చిత్రం గత సంక్రాంతికి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్ కామెడీ, వరుణ్ తేజ టైమింగ్ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. గతఏడాది సంక్రాంతి బరిలో ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 రూపొందుతుంది. గత కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులతో బిజీ అయ్యాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ సినిమాలో ఎంత మంది హీరోలు ఉంటారు, హీరోయిన్‌లు ఎవరు. మొదటి పార్ట్‌లానే రెండో పార్ట్ ఉంటుందా అనే అనుమానాలకి తాజాగా క్లారిటీ ఇచ్చారు అనీల్ రావిపూడి. ఎఫ్2లో ఎవరెవరు ఉన్నారో... ఎఫ్ 3లో కూడా వాళ్లే కనిపిస్తారన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలలోనే ఎఫ్3 కూడా ఉంటుందన్నాడు. అయితే సినిమా సెకండాఫ్‌లో ఏదైన ఛాన్స్ ఉంటే మరో హీరో గురించి ఆలోచిస్తామని అంటున్నాడు అనీల్ రావిపూడి. హౌస్‌ఫుల్, గోల్ మాల్ తరహా ఫ్రాంచైజీని తెలుగులోకి తీసుకొస్తున్నాం. వెంకీ ఆసనం ఎందుకు వేశాడు. కోబ్రో అంటూ వెంకీని వరుణ్ ఎందుకు కలిసాడు లాంటి ఆసక్తికర సన్నివేశాలతో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని అనిల్ తెలిపాడు. . బాలీవుడ్‌లో వచ్చిన ‘గోల్‌మాల్’ సినిమా సిరీస్‌లా వరుసగా తీయాలని ఉందని గతంలోనే అనిల్ రావిపూడి తెలిపారు. అయితే ఎఫ్3 సినిమాలో వెంకీ, వరుణ్ లతో పాటుగా కూడా నటించనున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. కానీ ప్రస్తుతం ‘నారప్ప’ మూవీ షూటింగ్ లో.. బాక్సర్ గా VT10 చిత్రంతో బిజీగా ఉన్నారు. మరి రవితేజ ఈ సినిమాలో కనిపిస్తారా లేదా అన్న విషయం తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ‘F2’ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో బిగ్ హిట్ కొట్టేందుకు F3ని తీస్తున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b3ViL5
No comments:
Post a Comment