అందుకే ఇంట్లో గొడవపడి బయటకొచ్చా.. దయచేసి సహకరించండి: విజయ్ దేవరకొండ

కరోనా విజృంభణనకు బ్రేకులు వేసేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఈ పీరియడ్‌లో ఎవ్వరూ బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు చేయడంలో పోలీసులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రేయింబవళ్లు రోడ్లపైనే ఉంటూ ఎవ్వరూ బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బందిని అభినందించారు హీరో . ప్రజల క్షేమం కోసం మేమున్నాం అంటూ అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల కోసం తన వంతు సాయం చేయడానికి రాచకొండ సీపీ దగ్గర అనుమతి తీసుకొని, నగరంలోని అన్ని పోలీస్ చెక్ పోస్ట్‌ల వద్ద ఉన్న పోలీసులను కలిసి ఫ్రూట్ జ్యూస్ అందజేశారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ కర్ఫ్యూ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని కలిసి వారిపై అభినందనల వర్షం కురిపించారు. లాక్‌డౌన్ సమయంలో పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు, వారి తెగువ వెల కట్టలేనిదని అన్నారు. వేసవికాలంలో పోలీసులు ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని సూచించారు. కరోనాపై ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్, ప్రజలను అప్రమత్తం చేస్తున్న విధానం భేష్ అని తెలిపారు విజయ్ దేవరకొండ. పోలీసుల శ్రమకు హ్యాట్సాఫ్ అని ఆయన అన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలంతా ఇంట్లో ఉంటే పోలీసులు మాత్రం రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు. పేద ప్రజలకూ అన్నదానాలు కూడా చేస్తున్నారు. 24 గంటలు మన కోసం పని చేస్తున్న పోలీసులకు ధన్యవాదాలు. ఈ సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉంటూ పోలీసులకు సహకరించాలి అని చెప్పారు విజయ్. ముఖ్యంగా మైనర్ తల్లిదండ్రులు వారి పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని ఆయన అన్నారు. పోలీసులకు, డాక్టర్లకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సహకరించండి అని విజయ్ దేవరకొండ చెప్పారు. ఇంట్లో పేరెంట్స్‌తో గొడవ పడి మరీ.. మనందరి కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులను చూడడానికి బయటికి వచ్చానని ఆయన తెలిపారు. అందరూ రాష్ట్రం, దేశం కోసం కరోనా వైరస్ తరిమి కొట్టేందుకు ఇంట్లోనే ఉండి పోలీసులకు సహకరిద్దాం. కరోనా పై యుద్ధం సాధించాలంటే కలిసి కట్టుగా ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే అనేక సూచనలు చేసింది. వాటన్నింటినీ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు ధరించండి అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్ సిపి అజని కుమార్ మాట్లాడుతూ.. ''లాక్‌డౌన్ సందర్భంగా పోలీసులు 24 గంటలు పని చేస్తున్నారు. పోలీసులను ప్రోత్సాహించేందుకు హీరో విజయ్ దేవరకొండ రావడం సంతోషంగా ఉంది. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి. పోలీసులకు పూర్తి సహకారం అందించాలి'' అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2K95OVq

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts