కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఈ క్వారంటైన్ సమయాన్ని సూపర్ స్టార్ సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. భార్యాపిల్లలతో ఏం చక్కా ఇంట్లోనే ఉంటూ సరదాగా గడుపుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు సైతం ఈ క్వారంటైన్ టైమ్‌ని తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నానని తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. బేసికల్‌గా మహేష్ బాబుకు తన కుటుంబంతో గడపడమంటే మహా సరదా. ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌లో కూడా ఏ మాత్రం బ్రేక్ వచ్చినా భార్యాపిల్లతో టూర్స్ వేస్తూ ప్రపంచాన్ని చుట్టి వస్తుంటారు మహేష్. అయితే ఇప్పుడు దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించడంతో ఇంట్లోనే ఉంటూ భార్యాపిల్లలతో జాలీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో క్వారంటైన్ టైమ్ ఎలా ఉందో పేర్కొంటూ తన కూతురు సితారతో ఆడుకుంటున్న పిక్‌ని ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు మహేష్ బాబు. ఈ మేరకు 'అందరూ ఇంట్లోనే ఉండండి.. సేఫ్‌గా ఉండండి' అని పేర్కొన్నారు సూపర్ స్టార్ మహేష్. తన గారాలపట్టి సితారతో మహేష్ బాబు ఇలా ఆడుకోవడం చూసి తెగ మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్. ''బ్యూటిఫుల్ పిక్, వెరీ నైస్, బాగా చెప్పారు, నువ్వు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి అన్నా.. మా ఫ్యాన్స్‌కి అది చాలు'' అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' అంటూ బిగ్గెస్ట్ హిట్ సాధించిన మహేష్ బాబు.. ప్రస్తుతం తన తదుపరి సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఉండబోతోందని సమాచారం. అతిత్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xxqv5h
No comments:
Post a Comment