
ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు సీనియర్ హీరోయిన్ . ఈ సందర్భంగా వీడియో సందేశాన్ని అందించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తోంది కోవిడ్ 19 కరోనా వైరస్. మన గవర్నమెంట్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని లాక్ డౌన్ ప్రకటించారు. అయితే చాలా మంది ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా.. ఇంకా బయట తిరుగుతున్నారనే అని వింటున్నప్పుడు చాలా బాధగా ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లో అక్కడ ప్రభుత్వాలు చెబుతున్నా వినకుండా జనం ఎవరికి వచ్చినట్టు వాళ్లు బయటకు వచ్చి తిరిగారు కాబట్టే అక్కడ ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఆ దేశాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో చూడండి. రోజుకు వేలాది మంది జనం ఈ వైరస్ సోకుతోంది. వందలాది మంది జనం చనిపోతున్నారు. ఇక అమెరికాలో అయితే రెండున్నర లక్షల మందికి ఈ వైరస్ ఎటాక్ అయ్యింది. ఈ పరిస్థితి మనకు వద్దు. దయచేసి గవర్నమెంట్ మాట వినండి. ఎంతసేపు ఇంట్లో కూర్చుంటాం.. ఎంతసేపు టీవీలు చూస్తాం.. చాలా బోర్ కొడుతుంది అని చెప్పకండి. ఇంట్లో పిల్లలు ఉంటే వారితో ఆడుకోండి. వాళ్లకు చదువు చెప్పండి. ఇంటిపని, వంటపనిలో హెల్ప్ చేయండి. యోగా, మెడిటేషన్ ఇలా ఎన్నో పనులు చేయొచ్చు. అంతేకాదు ఇంట్లోనే కూర్చుని ప్రపంచాన్ని కాపాడే అద్భుతమైన ఛాన్స్ అందరికీ దొరకదు. సీరియస్‌గానే చెప్తున్నా.. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం ఇదే. దయచేసి ఇంట్లోనే ఉండండి’ అంటూ ఎమోషనల్ వీడియో సందేశం ఇచ్చారు మీనా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JJ6Lni
No comments:
Post a Comment