కొందరు హీరోలకు పిచ్చి అభిమానులు ఉంటారు. వాళ్ల హీరోల కోసం అనేక సందర్భాల్లో ప్రాణాలు సైతం పణంగా పెట్టేస్తారు. తమ అభిమాన తారల కోసం వాగ్వాదానికి సైతం దిగుతుంటారు. తాజాగా ఇద్దరు స్నేహితులు తమ అభిమాన హీరోల కోసం వాగ్వాదానికి దిగారు. గొడవ కాస్త ముదరడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరక్కానంలో జరిగిందీ ఘటన. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.... యువరాజ్, దినేశ్ మంచి స్నేహితులు. యువరాజ్ హీరో విజయ్‌కు వీరాభిమాని అయితే... అతడి స్నేహితుడు దినేష్‌కు సూపర్ స్టార్ అంటే ప్రాణం. ఇద్దరు మంచి మిత్రులే అయినప్పటికీ అభిమాన హీరోల విషయానికి వచ్చేసరికి ఇద్దరూ శత్రువుల్లా పోట్లాడుకునేవారు. అయితే కరోనా వైరస్ విషయంలో సినీనటులు ఇచ్చిన విరాళాల విషయం ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. విరాళాల గురించి గురువారం ఇద్దరు వాదించుకున్నారు. తమ హీరో పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడంటే, కాదు తమ హీరోనే ఇచ్చాడంటూ ఇద్దరూ ఘర్షణకు దిగారు. గొడవ కాస్త పెద్దది కావడంతో ఇద్దరూ ఆగ్రహంతో ఊగిపోయారు.. ఒకర్నొకరు నెట్టుకున్నారు. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన దినేశ్‌బాబు.. యువరాజ్‌ను గట్టిగా నెట్టేయడంతో అతడు ఒక్కసారిగా కిందపడ్డాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిత్రుడు చనిపోవడంతో ఒక్కసారిగా దినేష్ షాక్ అయ్యాడు. భయంతో ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువరాజ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దినేశ్‌బాబును శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eO2qgT
No comments:
Post a Comment