లాక్ డౌన్‌తో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే ఈ సమయంలో దినసరి కూలీలు.... రోజువారీ వేతనం కోసం పనిచేస్తున్న వారు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అనేకమంది సినీ కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారు. అలాంటివారి కోసం తారలంతా ఒక్కటవుతున్నారు. పలువురు నటీనటులు, దర్శకులు, సాంకేతికనిపుణులు తమకు తోచిన విధంగా కరోనా బాధితుల సహాయార్ధం విరాళం ఇస్తోన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ తమకు సాధ్యమైనంత సహాయం చేస్తోన్నారు. ఇప్పుడు తాజాగా సౌత్ లేడీ సూపర్ స్టార్ భారీ సాయం అందించారు. రోజువారీ సినిమా కార్మికులకు ఆమె రూ.20 లక్షలు విరాళం ప్రకటించారు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు ఆమె ఈ విరాళం అందించారు కరోనా లాక్ డౌన్‌తో దినసరి కూలీల బతుకులు కష్టాల్లో పడ్డాయి. దీంతో చాలామంది సలెబ్రిటీలు శివ కార్తికేయన్, ఐశ్వర్య రాజేష్, విజయ్ సేతుపతి లాంటి వాళ్లు విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు నయనతార కూడా ముందుకు వచ్చారు. అయితే కోలివుడ్‌లో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్లు మాత్రమే సినీ కార్మికుల కోసం విరాళాలు ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ఐశ్వర్య రాజేష్ లక్ష రూపాయల విరాళం అందించారు. సినీకార్మికుల కోసం విరాళాలు అందివ్వాలని ఫెప్సీ ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి ప్రముఖ తారలందర్నీ కోరారు. ఆ తర్వాత ఆయన ఓ లేఖ కూడా రాశారు. ప్రస్తుతమున్న సమయంలో మనమంతా ఒక్కటిగా నిలబడి... సినీ కార్మికుల కోసం అండగా ఉండాలని.. కోరారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UK1cLm
No comments:
Post a Comment