ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. చిన్న-పెద్ద, సామాన్యుడు- సెలబ్రిటీ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ వణికిస్తోంది. చైనాలో పుట్టి దేశ విదేశాలను గడగడలాడిస్తున్న ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షకు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇందులో సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా అందరూ ఉన్నారు. తాజాగా కరోనా వైరస్ కారణంగా హాలీవుడ్ నటి (74) కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నటి హిల్లరీ హీత్ కుమారుడు అలెక్స్ విలియమ్స్ తన తల్లి మరణించిన విషయాన్ని వెల్లడించారు. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పోస్ట్ పెట్టి హిల్లరీ హీత్ మరణించినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయింది కానీ కరోనా వైరస్ సోకి కాదని కుమారుడు అలెక్స్ విలియమ్స్ తెలిపినట్లు సమాచారం. ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌లో జన్మించిన హిల్లరీ హీత్.. నటిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. 1968 సంవత్సరం వచ్చిన 'విచ్‌ఫైండర్ జనరల్' సినిమాతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. నిర్మాతగా కూడా మారి పలు సినిమాలు రూపొందించింది. హిల్లరీ నిర్మించిన సినిమాల్లో 'యాన్ ఓఫులీ బిగ్ అడ్వెంచర్', 'నీల్ బై మౌత్' చిత్రాలు ముఖ్యమైనవి. హిల్లరీ హీత్ మరణం పట్ల హాలీవుడ్ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eduZEb
No comments:
Post a Comment