ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మానవాళి దిన చర్యలను కకావికలం చేసేసింది. షెడ్యూల్ చేసుకున్న అన్నిపనులు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, షూటింగులు, ప్రయాణాలు ఇలా అన్నీ పోస్ట్‌పోన్ అయ్యాయి. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా అందరిదీ ఇదే పరిస్థితి. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఈ కరోనా ఎఫెక్ట్ టాలీవుడ్ హీరో పెళ్లిపై డైరెక్టుగా పడింది. కరోనా కారణంగా తన పెళ్లిని వాయిదా వేసుకున్న నితిన్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై తనకు కాబోయే భార్య ఎలా రియాక్ట్ అయిందో చెప్పుకొచ్చారు. ఎంతోకాలంగా షాలినితో ప్రేమలో ఉన్నారు నితిన్. తన పెళ్లి ఏప్రిల్ 16వ జరగనుందని ఆయన ప్రకటించేదాకా నితిన్- షాలిని ప్రేమికులనే విషయం ఎవ్వరికీ తెలియదు. పెద్దల అంగీకారంతో ఏప్రిల్ 16న దుబాయ్‌లోని హోటల్ పలాజో వర్సాచీలో ఒక్కటి కావడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ఈ ప్రేమజంటకు కరోనా మహమ్మారి రూపంలో ఊహించని షాక్ తగిలింది. దేశవిదేశాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తమ పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు నితిన్. ఈ మేరకు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి వాయిదా విషయమై స్పందించిన ఆయన.. దీనిపై తనకు కాబోయే భార్య షాలిని ఎలా రియాక్ట్ అయిందో చెప్పారు. కుటుంబమంతా కలిసి బాగా ఆలోచించాకే పెళ్లి వాయిదా వేయడంపై ఓ నిర్ణయానికి వచ్చామని అన్నారు నితిన్. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా చేసుకోవాలే తప్ప, మాస్కులు ధరించి భయంతో చేసుకోవద్దని భావించి ఇలా డిసైడ్ అయ్యామని నితిన్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడగానే పెళ్లి చేసుకుందామని కాబోయే భార్య షాలినితో చెప్పగానే సంతోషంగా ఓకే చెప్పిందని నితిన్ అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yVTohm
No comments:
Post a Comment