కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర సమయంలో ప్రజలని ఆదుకునేందుకు సినీతారలంతా ముందుకు వస్తున్నారుజ పలువురు ప్రముఖులు ఇప్పటికే భారీ విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్స్ మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరో ఇద్దరో మాత్రమే విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. లాక్ డౌన్ పూర్తయ్యే వారకు గుర్గావ్‌లోని తన ఇంటి దగ్గరలో ఉన్న మురికివాడలోని కుటుంబానికి సాయం చేస్తానంది. అక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటే వారందరికి రెండు పూటలా ఆహారం, నీరు సరఫరా చేస్తానంటుంది. మురికి వాడలో ఉండే వారి పరిస్థితి మా నాన్నగారు తెలుసుకున్నారు. వారికి ఆహారం అందించాలని మేం అనుకున్నాం. ఇంటికి దగ్గరలో ఆహారం వండించి, వారికి పంపిచే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు తమకి తోచినంత సాయం చేయాలి. మనకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంది. దీనిని అదృష్టంగా భావించాలి. ఎవరి భోజనం వారు తింటున్నప్పుడు వారి ముఖంలో చిరు నవ్వు నాకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే నేను ఈ రకంగా సాయం చేస్తున్నాను అని రకుల్ పేర్కొంది. శనివారం నుంచి లాక్‌డౌన్ కాలం ముగిసేంత వరకు వీరికి ఇలానే ఆహారం పంపిస్తానని ఆమె తాజాగా ఓ వైబ్‌సైట్‌తో తెలిపింది రకుల్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bNbmAA
No comments:
Post a Comment