ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక రియాక్షన్.. సీక్రెట్స్ మొత్తం చిరంజీవి కూతురు వద్దే!!

ఈ లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి వారి వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ సంగతులన్నీ రాబడుతున్నాయి మీడియా వర్గాలు. తాజాగా మెగా డాటర్, కొణిదెల నాగబాబు కూతురు నిహారికను ఇంటర్వ్యూ చేసిన ఓ మీడియా.. ప్రభాస్‌తో మీ పెళ్లిపై వస్తున్న వార్తల సంగతేంటి? అని ప్రశ్నించింది. దీనిపై రియాక్ట్ అయిన అలాంటి వార్తలపై క్లారిటీ ఇస్తూ సమాధానమిచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా డాటర్ నిహారిక ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే నిహారికకు అదే ప్రశ్న ఎదురైంది. దానికి బదులిచ్చిన మెగా డాటర్.. ఐ యామ్ సారీ టు డిజప్పాయింట్, నేను ప్రభాస్‌ని లవ్ చేయడం లేదు అని సింపుల్‌గా చెప్పేసింది. తన ఫ్యామిలీ అందరిలో బెస్ట్ కజిన్ వైష్ణవ్ తేజ్ అని, చిన్నప్పటి నుంచే వైష్ణవ్‌‌తో ఫుల్ క్లోజ్‌గా ఉండేదాన్నని, వైష్ణవ్ మనసు వెన్న అని చెప్పుకొచ్చింది నిహారిక. అలాగే సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడిన నిహారిక.. తేజ్ బావ, తనను ఎప్పుడైనా తల్లీ, పాప అనే పిలుస్తాడని తెలిపింది. తేజ్ బావ తనను పేరు పెట్టి పిలిచిన సందర్భం ఒక్కటి కూడా గుర్తులేదని చెప్పింది. నిహా తల్లి అని మాత్రమే అంటాడని, రియల్లీ లవబుల్ పర్సన్ అనేసింది. అత్త కొడుకు కాబట్టి తేజ్‌ని బావ అని పిలుస్తానే తప్ప, తనకు అన్నలాగే అని చెప్పుకొచ్చింది నిహారిక. ఫిమేల్ కజిన్స్‌లో శ్రీజ బెస్ట్ ఫ్రెండ్ అని, స్నేహారెడ్డి కూడా బాగా కలిసిపోతుందని తెలిపింది నిహారిక. ఇక వయసులో పెద్దదైన చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత అక్క వాళ్ళ ఇల్లు నాకు సెకండ్ హౌస్ లాంటిదని, వాళ్ళింట్లో ఎక్కువ సమయం గడుపుతానని, తను బాగా క్లోజ్ అని చెప్పింది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే తన సీక్రెట్స్ మొత్తం ఆమెకే తెలుసని చెప్పి షాకిచ్చింది నిహారిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VR9NeH

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts