ప్రస్తుతం ఉన్న ఈ కరోనా కల్లోల పరిస్థితుల్లో సెలబ్రిటీల మరణాలు అలజడి రేపుతున్నాయి. కనీసం కడసారి చూపుకు ఆత్మీయులు రాలేనటువంటి సమయమిది. మరణించిన వ్యక్తికి కరోనా లేకున్నప్పటికీ కేవలం సోషల్ మీడియాలో సంతాప సందేశాన్ని తెలియజేయడం తప్పితే ఇంకేమీ చేయలేరు కూడా. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రముఖ సినీ నటుడు, గోల్డెన్ గ్లోబ్ విజేత మరణించడం హాలీవుడ్ సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది. అలనాటి హాలీవుడ్ హీరో హీరో బ్రేన్ డెన్నీ ఏప్రిల్ 15న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈయన వయసు 81 సంవత్సరాలు. 70వ దశకంలో హాలీవుడ్‌ను ఉర్రూతలూగించారు బ్రేన్ డెన్నీ. ఆయన నటించిన ఫస్ట్ బ్లడ్, రోమియో అండ్ జూలియట్ ఆ రోజుల్లో భారీ హిట్ సినిమాలుగా నిలిచాయి. నాలుగు దశాబ్ధాల పాటు టీవీ షోలు కూడా చేశారు. 1996లో రోమియో జూలియట్ సినిమాలో రోమియో తండ్రిగా నటించి గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొందారు. బ్రేన్ డెన్నీ భార్య పేరు జెన్నీఫర్. ఈ దంపతులకు కార్‌మాక్, కూతురు ఎలిజబెత్ ఉన్నారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఈ కరోనా కల్లోల సమయంలో మరణించిన ఆయనది సహజ మరణమే అని, కరోనా డెత్ కాదని చెప్పారు కుటుంబ సభ్యులు. బ్రేన్ డెన్నీ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలియజేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KeWjUF
No comments:
Post a Comment