టాలీవుడ్ తెరపై పర భాషా నటీమణులు రాణిస్తున్న ఈ రోజుల్లో తాను కూడా వారిలో ఒకరిగా ఉంటానంటూ తీవ్ర పోటీ ఇస్తోంది తెలుగు భామ ఈషా రెబ్బ. హీరోయిన్‌గా కెరీర్ గ్రాఫ్ పీక్ స్టేజ్‌కి తీసుకుపోయేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇన్నాళ్లు అందాల ఆరబోత విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించిన ఈ బ్యూటీ ఇకపై తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. టాలీవుడ్ తెరపై తెలుగు హీరోయిన్ల మెరుపులు కరువైన ఈ రోజుల్లో పరభాషా నటీమణుల పోటీని తట్టుకుని నెట్టుకొస్తోంది ఈషా రెబ్బ. ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో పరిచయమైన ఈమె కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో ఆశించిన మేర అవకాశాలు దక్కలేదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’ సినిమాలో ఛాన్స్ వచ్చినా అది ఆమె కెరీర్ గ్రోత్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో రూటు మార్చేసిన ఈషా ఘాటు అందాలతో కవ్వించడం మొదలుపెట్టింది. స్టార్ హీరోయిన్లకు దీటైన అందం తన సొంతం అని నిరూపించేలా ఫోటో షూట్స్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. అంతేకాదు కథ డిమాండ్ చేయాలి గానీ అందాలను ఆరబోయడానికి, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి సిద్దమే అని కూడా చెబుతోంది. ఇది ఏ రకంగా కలిసొచ్చిందో తెలియదు గానీ చివరకు ఈ బ్యూటీకి ఓ బోల్డ్ క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది. స్వయం తృప్తిపొందే గృహిణిగా నటించి కియారా అద్వానీ సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘’ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్‌లో ఈషా ఛాన్స్ దక్కించుకుంది. ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి ఈ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్న ఈషా రెబ్బ.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇందులో తన క్యారెక్టర్ విషయమై స్పందించింది. అచ్చం కియారా లాగే బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోనుందట ఈషా రెబ్బ. అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ వెబ్ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్, హాట్‌నెస్ ఉంటుందని అయితే అది హద్దులు మించదని ఆమె చెబుతోంది. బోల్డ్‌గా నటించడానికి, బూతు కంటెంట్ సినిమాల్లో కనిపించడానికి మధ్య చాలా తేడా ఉంటుందని, కథ ప్రకారంగా ఈ వెబ్ సిరీస్‌లో సెక్స్ కంటెంట్ ఉంటుంది తప్ప శృతిమించదని ఈషా తెలిపింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RzPCk9
No comments:
Post a Comment