దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అంతా తమ తమ పనులు మానుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండి అంతా ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరుతున్నారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు అలీ కరోనా వ్యాధి కోసం ఇంట్లోనే ఉండి నమాజ్ చేస్తున్నానని తెలిపారు. గత పదిరోజులుగా తాను ఇంట్లోనే ఉండి కరోనా మన దేశం నుంచి వెళ్లిపోవాలని కోరుతూ... నమాజ్ చేస్తున్నానట్లుగా అలీ తెలిపారు. ఇటలీలో పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటలీలో కరోనా వ్యాధి సోకి చనిపోతుంటే... వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ప్రజలంతా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వాలకు, అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు మండిపోతున్న కూరగాయలు, నిత్యావసరాల ధరలపై కూడా అలీ మండిపడ్డారు. ఇది డబ్బు సంపాదించే సమయంకాదన్నారు. దేశమంతా వైరస్ వ్యాప్తితో తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో చాలా మంది వ్యాపారులు, నిత్యావసరాలు, కూరగాయల ధరలను పెంచి, డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నారన్నారు. ఇది సరికాదని హాస్య నటుడు అలీ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి కోసం ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు చెరో లక్ష రూపాయలు ఆయన విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న సమయం డబ్బు సంపాదించే సమయం కాదని, ఎంత రేటు ఉంటే అంతకే అమ్మాలని వ్యాపారులకు అలీ విజ్ఞప్తి చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33PP7az
No comments:
Post a Comment