కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కేవలం నిత్యవసరాలు, మెడికల్ షాపులు మినహా మిగిలిన దుకాణాలన్నింటిని బంద్ చేయించారు. మద్యం దుకాణాల్ని కూడా మూసివేయించారు. దీంతో మద్యం ప్రియులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వంటి రాష్ట్రంలో అయితే మద్యం దొరక్క కొందరు వింత ప్రవర్తనలతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీంతో తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరో ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశాడు. రోజులో రెండు గంటలైనా మందు షాపులు తెరవాలని ప్రభుత్వానికి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయ రిక్వెస్ట్ చేశారు. మందు బాబులకు తన మద్దతుని తెలియజేశారు. ప్రతిరోజూ సాయంత్రం లిక్కర్ షాపులు తెరవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ''ప్రభుత్వాలకు ఎక్సైజ్ శాఖ నుండి డబ్బులు అవసరం. అందుకోసం లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలను కొంతకాలం సాయంత్ర వేళల్లో తెరిస్తే బావుంటుంది. తప్పుగా అర్థం చేసుకుని నన్ను తిట్టొద్దు. లాక్ డౌన్ సమయంలో మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశతో ఉంటాడు. ఇలాంటి సమయంలో మద్యం అవసరం. కాబట్టి బ్లాక్‌లో అయినా మద్యం అమ్మే ఏర్పాటు చేయండి'' అని ట్వీట్ చేశారు రిషి కపూర్. అయితే రిషి కపూర్ చేసిన ఈ పోస్టుకు చాలామంది మద్దతు పలుకుతున్నారు. మీ అభిప్రాయంతో మేం ఏకీభవిస్తున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు సూపర్ సార్ అంటూ.... ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే మద్యంపై కవితలు సైతం రాసి పోస్టు పెడుతున్నారు. ఆకలితో ఉన్నవాడు అన్నం, దాహంతో ఉన్నవాడికి నీళ్లు ఎలా అవసరమో... తాగుబోతుకు తాగుడు కూడా అంతే అవసరం ... అంటూ ఓ నెటిజన్ కవిత కూడా రాసి పోస్టు పెట్టాడు. మరికొందరు మాత్రం ఇలాంటి సమయంలో మద్యం షాపుల్ని తెరిస్తే... ఆ రద్దీని తట్టుకోలేమని చెబుతున్నారు. అలాంటివారిని కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుందని చెబుతున్నారు. మరి ప్రభుత్వం రిషి కపూర్ రిక్వెస్ట్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి. కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్ నెలకొంది. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రజలు, సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమైయారు. ఇదే సమయంలో మందుబాబులకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UNp3Zu
No comments:
Post a Comment