నందమూరి బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రూలర్’. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ, కె.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో రెండో సినిమా తెరకెక్కిన ‘రూలర్’ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో బాలకృష్ణ, హీరోయిన్ వేదిక, దర్శకుడు కె.యస్.రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నటి దేవీశ్రీ మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆనందం పట్టలేక కంటతడి పెట్టుకున్నారు. ‘రూలర్’ సినిమాలో ఆమె బాలకృష్ణకు తల్లిగా నటించారు. ‘‘బాలయ్య బాబు గారి మదర్ క్యారెక్టర్ అని నాకు ఫోన్ రాగానే ఒక నిమిషం షాకయ్యాను. ఎందుకంటే, నా కెరీర్‌లో చాలా సినిమాలు చేశాను. కానీ, బ్రేక్ వచ్చే క్యారెక్టర్ ఏదీ పడలేదు. అందుకే, ఆ ఆనందం నేను తట్టుకోలేకపోయాను. ఐ యామ్ వెరీ లక్కీ’’ అని మాట్లాడుతూ దేవీశ్రీ కంటతడి పెట్టుకున్నారు. ఆమెను యాంకర్ గీత ఓదార్చారు. కొన్ని సెకెన్ల తరవాత మళ్లీ తేరుకుని దేవీశ్రీ మాట్లాడారు. ‘‘బాలయ్య బాబుతో కలిసి నేనింకా ట్రావెల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులూ ఆయనతో ఏదైనా ఒక్క సెంటిమెంట్ సీన్ పడితే బాగుండు అని ఎదురుచూసేదాన్ని. చేయాలని బాగా కోరిక ఉండేది. అయితే, ఆ అవకాశం రాలేదు. మళ్లీ మళ్లీ ఆయన మూవీస్‌లో చేయాలని నేను కోరుకుంటున్నాను’’ అని దేవీశ్రీ ముగించారు. See Photo Story:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/373LluJ
No comments:
Post a Comment