నేను చేయాల్సింది చాలా ఉంది.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకారోత్సవంలో అమితాబ్ ఉద్వేగం

బిగ్ బి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అమితాబ్ బచ్చన్‌ను వరించింది. 2019 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అమితాబ్‌ను భారత ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి చేతుల మీదుగా అమితాబ్ ఈ అవార్డును ఆదివారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం అందించిన ఈ అవార్డుని తాను బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, అభిమానుల ఆదరణ, దర్శకనిర్మాతల సహకారం వల్లే తాను ఈ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగానని అమితాబ్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, తాను సినిమా రంగానికి చేయాల్సి ఎంతో ఉందని అమితాబ్ వ్యాఖ్యానించారు. అవార్డు కింద అమితాబ్‌కు స్వర్ణ కమలం, రూ.10 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని రాష్ట్రపతి కోవింద్ అందజేశారు. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జాతీయ చలచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి బిగ్‌బీ హాజరుకాలేకపోయారు. అమితాబ్ గతంలో అగ్నిపథ్, బ్లాక్, పా, పీకు తదితర చిత్రాలకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డులను అందుకున్నారు. ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పేరిట ఆయన శతజయంతి సందర్భంగా 1963లో జాతీయ అవార్డును భారత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపును అందిస్తున్న భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. 1913లో రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం 19 ఏళ్లు సాగింది. నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే-రచయితగా ఆయన 95 చిత్రాలు, 26 లఘు చిత్రాలను రూపొందించారు. ఇక, సినిమా రంగానికి చేసిన సేవలకు గానూ ఆయన పేరుతో ఏటా ఈ అవార్డును అందజేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే తొలి అవార్డును 1969లో దేవికారాణి రోరిచ్ అందుకున్నారు. తెలుగులో బీఎన్ రెడ్డి, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కే విశ్వనాథ్‌లు ఈ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు. ఆశా భోంస్లే, లతా మంగేష్కర్, రాజ్ కపూర్, బాలచందర్ లాంటి సినీ దిగ్గజాలను కూడా ఈ అవార్డు వరించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37iumou

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts