మీడియా ముందు కన్నీరుపెట్టిన ‘ఆర్ ఆర్ ఆర్’ హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ తన సోదరి గురించి చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. ఆలియా సోదరి షహీన్ ఒకప్పుడు తీవ్ర డిప్రెషన్‌తో బాధపడ్డారు. ట్రీట్‌మెంట్ తీసుకున్నాక కోలుకున్నారు. ఈ సందర్భంగా తాను డిప్రెషన్‌తో ఎలా పోరాడిందో వివరిస్తూ ‘ఐ హావ్ నెవర్ బీన్ హ్యాపీయర్’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఆదివారం ముంబయిలో ఆలియా భట్ లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో తన సోదరి డిప్రెషన్‌తో ఎలా బాధపడిందో వివరిస్తూ ఆలియా ఉద్వేగానికి లోనైంది. దాంతో పక్కనే ఉన్న షహీన్ తన సోదరిని ఓదార్చేందుకు ప్రయత్నించింది. అయినా ఆలియా కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆలియా ఏడుస్తున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తానెప్పుడూ డిప్రెషన్‌తో బాధపడలేదు కానీ ఒకరకమైన ఆత్రుతకు గురయ్యేదాన్నని గత ఐదారు నెలలుగా ఎందుకో చాలా బాధాకరంగా అనిపిస్తోందని తెలిపారు. ఎట్టకేలకు తన సోదరి డిప్రెషన్ నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉందని, ఆమె రాసిన బుక్ చదివాక తాను ఎదుర్కొంటున్న సమస్య ఏంటో అర్థమైందని తెలిపారు. ప్రస్తుతం ఆలియా ‘ఆర్ ఆర్ ఆర్’, ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’ సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కి్స్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఆలియా.. రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామ్ చరణ్, ఆలియా భట్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తైందట. దాంతో రాజమౌళి ఆలియాకు దగ్గరుండి సెండాఫ్ చేశారట. పలు సన్నివేశాలను తెరకెక్కించారట. సినిమాలో వీరిద్దరికీ సంబంధించిన రొమాంటిక్ పాట కూడా ఉండబోతోందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rJFgnJ

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts