
హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం . త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, నవదీప్‌ల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తమన్ సంగీతమందించిన ఈ సినిమాలోని సామజవరగన, రాములో రాములా పాటలు ఆన్‌లైన్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించటంతో ఆడియో సూపర్ హిట్ అయ్యింది. Also Read: తాజాగా ఈ సినిమాలోని నాలుగు పాటు టీజర్ రిలీజ్ అయ్యింది. బుట్ట బొమ్మా అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ టీజర్ కొద్ది రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఆదివారం ఈ సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మేల్ సోలోగా సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించగా అర్మాన్ మాలిక్ ఆలపించాడు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/392QSU5
No comments:
Post a Comment