మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన భారీ హిస్టారికల్ మూవీ . తెల్ల దొరలను ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు మెగా ఫ్యామిలీ. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కావటంతో మెగా తనయుడు రామ్ చరణ్ స్వయంగా ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా దాదపు 270 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. స్టైలిష్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ హీరో సుధీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా, రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటించారు. Also Read: గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా, పాజిటివ్ టాక్ తో ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించి మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. అయితే నార్త్ మార్కెట్‌లో మాత్రం మెగాస్టార్‌ను రిజల్ట్ నిరాశపరిచిందనే చెప్పాలి. బాలీవుడ్‌లో భారీ వసూళ్లు సాధిస్తుందని భావించిన సైరా ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. రివ్యూల పరంగా ఓకె అనిపించినా వసూళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే సౌత్ మార్కెట్‌లో మాత్రం సైరా సరికొత్త రికార్డ్‌లను సృష్టిస్తోంది. 64 ఏళ్ల వయసులో పోరాట యోధుడిగా నటించి మెప్పించిన మెగాస్టార్, నాన్ బాహుబలి రికార్డ్‌ను తుడిచిపెట్టేశాడు. 20 రోజుల్లో ఈ సినిమా 270 కోట్ల వరకు గ్రాస్ సాధించింది రికార్డ్ సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 105 కోట్లకు పైగా షేర్ సాధించిన సైరా దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఓవర్ సీస్‌లోనూ ఇంకా స్టడిగా వసూళ్లు సాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2W30vfq
No comments:
Post a Comment