‘మీటూ’ ఉద్యమం వల్ల చిత్ర పరిశ్రమ బాగుపడుతుందని అందరూ ఆశించారు. కానీ ఎవరి పేర్లైతే బయటికి వచ్చాయో వారందరూ ఇప్పుడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పలువురు దర్శకులు, ప్రొడ్యూసర్లు, నటులు, సింగర్ల పేర్లు బయటికి వచ్చాయి. వారిని పని నుంచి తొలగించారు కూడా. సరిగ్గా ఏడాది తర్వాత వారంతా మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చేశారు. దాంతో ఆరోపణలు చేసిన వారికి న్యాయం జరగకుండా పోయింది. బాధితుల్లో ప్రముఖ బాలీవుడ్ గాయని ఒకరు. సింగర్ అను మాలిక్‌పై ఆమె గతేడాది లైంగిక ఆరోపణలు చేశారు. దాంతో ఇండియన్ ఐడల్ అనే సింగింగ్ రియాల్టీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న అను మాలిక్‌ను వెంటనే షో నుంచి తొలగించారు. ఏడాది తర్వాత ఆయన్ను మళ్లీ షోలోకి ఆహ్వానించారు. దాంతో సోనా చేసిన ప్రయత్నంగా వేస్ట్ అయిపోయింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ తన బాధను వ్యక్తం చేశారు. ‘ఇండియన్ ఐడల్ షోలో అను మాలిక్ ఉన్నాడు. అతను సోనా మొహాపాత్రను లైంగికంగా వేధించాడు. షో నుంచి తొలగించాక మళ్లీ ఏడాది తర్వాత అదే షోలో జడ్జ్‌గా కూర్చోవడం నన్ను షాక్‌కు గురిచేసింది. ఎంతో ధైర్యంతో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టిన నటీమణులు, ఫీమేల్ సింగర్ల ప్రయత్నం వేస్ట్ అయిపోయింది’ అని పేర్కొన్నాడు. దీనిపై సోనా మొహాపాత్ర స్పందిస్తూ.. ‘దీనంతటికీ కారణం సోనూ నిగమ్. అను మాలిక్‌కు కావాల్సినంత పబ్లిసిటీ కల్పించాడు. అను మాలిక్ కూడా ఓ తల్లికి బిడ్డే అని నేరం రుజువు అయ్యేంతవరకు ఆయన్ను జడ్జ్‌గా ఉండనివ్వాలని అన్నాడు. దాంతో షో నిర్వాహకులు మళ్లీ అను మాలిక్‌ను నియమించుకున్నారు. సోనూ ఇంతటితో ఆగలేదు. నా కాపురంలో నిప్పులు పోశాడు. నా భర్తకు నా గురించి లేనిపోనివి చెప్పాడు. నన్ను టెర్రరిస్ట్ అన్నాడు. నాపై ఓ కన్నేసి ఉంచాలని నా భర్తకు లేనిపోనివి నూరిపోశాడు. ఇప్పుడు అతని కళ్లు చల్లబడి ఉంటాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులకు న్యాయం జరగాలంటే ఇండియాలో మరో నిర్భయ ఘటన జరగాలేమోనని సోనా బాధపడ్డారు. బాధితురాలైన తనకు పని లేకుండా పోయిందని, తనను వేధించినవాడు మాత్రం ఎంతో సంతోషంగా డబ్బులు సంపాదించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడని అన్నారు. రేప్ చేస్తున్నప్పుడు, లైంగికంగా వేధిస్తున్నప్పుడు ఆడపిల్లలు ప్రూఫ్‌లు కలెక్ట్ చేస్తూ ఉండాలని ఈ వెధవల అభిప్రాయమని మండిపడ్డారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JEqLrA
No comments:
Post a Comment