బోల్డ్‌ హీరోయిన్‌ సెకండ్‌ మ్యారేజ్‌.. ఈసారి కూడా ప్రేమ పెళ్లే!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్‌ తన వ్యక్తిగత జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌తో తన వివాహ బంధానికి తెగదెంపులు చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన అమలా పాల్‌, త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెప్పారు. అంతేకాదు రెండో వివాహం కూడా ప్రేమ వివాహమే అంటూ క్లారిటీ ఇచ్చారు. గతంలో సినిమా ప్రమోషన్‌ సందర్భంగానూ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది అమలా పాల్. మీరు మళ్లీ వివాహం చేసుకుంటారా అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా `నేనేం సన్యాసం తీసుకోలేదు. తప్పకుండా త్వరలోనే వివాహం చేసుకుంటా..? ప్రస్తుతం ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఆడై కథ కూడా ముందుగా అతనికే వినిపించా` అంటూ సమాధానం ఇచ్చారు. అయితే వివాహం ఎప్పుడు అన్న విషయంలో మాత్రం వెల్లడించలేదు. Also Read: అంతేకాదు తన బాయ్‌ ఫ్రెండ్‌ తన కోసం ఎన్నో త్యాగాలు చేశాడన్న అమలాపాల్‌.. ఇన్నాళ్లు తల్లి మాత్రమే ఏం ఆశించకుండా ప్రేమిస్తుందని భావించాను. కానీ ఈ వ్యక్తి కూడా తనను అమ్మలాగే ప్రేమిస్తున్నాడంటూ చెప్పింది. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం వెల్లడించలేదు. 2017లో విజయ్‌ నుంచి విడాకులు తీసుకున్న అమలా పాల్ తరువాత హీరోయిన్‌గా బిజీ అయ్యింది. అమల నుంచి విడిపోయిన తరువాత విజయ్‌ కూడా రెండో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అమలా పాల్‌ కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతోంది. అయితే అమల వివాహం ఎప్పుడు జరగనుంది. అమల ప్రేమిస్తున్న ఆ వ్యక్తి ఎవరన్న విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ భామ రెండు తమిళ సినిమాలతో పాటు ఓ మలయాళ సినిమాలోనూ నటిస్తోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ohBJf8

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts