అభిమానం పీక్స్‌లోకి వెళితే ఫ్యాన్స్ ఎలాంటి పనులకు తెగిస్తారో వారికే తెలీదు. సెలబ్రిటీలను పబ్లిక్ ప్రాపర్టీలా భావించి రెచ్చిపోతుంటారు. ఇలాంటి అనుభవమే గ్లోబల్ స్టార్ భర్త, ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌కు ఎదురైంది. నిక్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఓ కాన్సర్ట్‌లో పాల్గొనడానికి వెళ్లాడు. నిక్ పాట పాడుతూ పెర్‌ఫాం చేస్తుండగా ఓ అభిమాని నిక్ కాళ్లు రాస్తూ, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దీనిని గమనించి నిక్‌ని టచ్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆ అమ్మాయి వినలేదు. నిక్ కాళ్లు పట్టుకుంటూనే ఉంది. అది నిక్‌కి కూడా నచ్చలేదు. దాంతో ఆ అమ్మాయిని ఏమీ అనలేక తన చేతిని పక్కకు తోసేశాడు. అక్కడే ఉన్న కొందరు అభిమానులు ఆ అమ్మాయి నిక్ పట్ల ప్రవర్తిస్తున్న తీరును రికార్డ్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం సరైన పద్ధతి కాదంటూ నెటిజన్లు ఆ అమ్మాయిని నోటికొచ్చినట్లు తిట్టిపోశారు. ఈ ఘటనపై ఇంకా ప్రియాంక చోప్రా స్పందించలేదు. ఓరకంగా చెప్పాలంటే నిక్‌కు జరిగింది ఓ మీటూ సంఘటనే. అమ్మాయి అయినంత మాత్రాన ఓ సెలబ్రిటీని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయకూడదు. అదే ఓ నటికి కానీ గాయనికి కానీ ఇలాంటి సంఘటన జరిగి ఉంటే రచ్చ అయివుండేది. కానీ ఇక్కడ బాధితుడు మగాడు కాబట్టి ఈ ఘటన గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడట్లేదు. నిక్ అభిమానులు మాత్రం దీనిని లైంగిక వేధింపుగా భావిస్తూ ఆ అభిమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా లాంటి దేశంలో ఇవన్నీ కామన్ కావచ్చు. కానీ ఓ వ్యక్తితో అలా ప్రవర్తించడం చాలా తప్పు అని నెటిజన్లు అంటున్నారు. నిక్ అమెరికన్ అయినంత మాత్రాన ఎవరు పడితే వారు వచ్చి చేతులు వేస్తే ఊరుకుంటాడు అనుకోవడం మూర్ఖత్వం అని అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ప్రియాంక లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ అభిమానికి బుద్ధి చెప్పి ఉండేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32Rhh3N
No comments:
Post a Comment