RRR భారీ ఈవెంట్ కోసం జక్కన్న ప్లాన్స్.. ఆ రెండు ఏరియాల్లో కళ్ళు చెదిరే ఏర్పాట్లు!

టాలీవుడ్ నుంచి మరో భారీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ పాన్ ఇండియా సినిమాను పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం మార్చి 25వ తేదీని ఫైనల్ చేసిన జక్కన్న.. ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌పై ఫోకస్ పెడుతున్నారు. సినిమాను ఎంత గ్రాండ్‌గా రూపొందిస్తారో ప్రమోషన్స్ విషయంలో అంతకంటే ఎక్కువ శ్రద్ద పెట్టేరాజమౌళి RRR కోసం పక్కా ప్లాన్స్ వేసుకున్నారట. ఈ నేపథ్యంలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్ గురించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు కానీ ఊహించని విధంగా కరోనా దాడితో పోస్ట్ పోన్ చేశారు. అయితే రిలీజ్ కాపీ రెడీ చేసుకున్న జక్కన్న.. డిసెంబర్ నెల నుంచే భారీ రేంజ్ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, విడుదల వాయిదా పడ్డాక కాస్త విరామం తీసుకున్న ఆయన, ఇక ప్రమోషన్స్ విషయంలో తగ్గేదే లే అంటున్నారట. సరికొత్త స్ట్రాటజీలతో వెళ్లాలని టీమ్ అందరికీ సూచిస్తున్నారట. ఈ క్రమంలోనే భారీ ఈవెంట్స్ నిర్వహించేందుకు కసరత్తులు షురూ చేశారట రాజమౌళి. మునుపెన్నడూ చూడనంత గ్రాండ్‌గా ఈ ఈవెంట్ ఉండాలని భావిస్తున్న ఆయన అందుకోసం రెండు ఏరియాలు సెలెక్ట్ చేసుకున్నారని టాక్. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్. ఈ ఈవెంట్ కన్నుల పండగ కావాలని, వివిధ భాషల్లోని స్టార్ హీరోహీరోయిన్లకు ఆహ్వానం పంపాలని రాజమౌళి చూస్తున్నారట. అతి త్వరలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు సంబంధించిన డేట్స్ ప్రకటించనున్నారని సమాచారం. వచ్చే వారంలో రాధేశ్యామ్ సినిమా విడుదల కానున్న నేసథ్యంలో ప్రమోషన్ క్లాష్ ఎందుకనే ఉద్దేశంతో ప్రస్తుతం జక్కన్న టీమ్ కాస్త సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్ విడుదల తర్వాత RRR టీమ్ రంగంలోకి దిగబోతోందట. అంతేకాదు RRR ప్రమోషన్స్ కోసం ఓ రేంజ్ బడ్జెట్ కేటాయించారని తెలుస్తుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. సో.. చూడాలి మరి జక్కన్న ఎలాంటి స్ట్రాటజీలతో ముందుకెళ్తారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/W5x2BtF

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts