అక్కినేని మూడో తరం నట వారసుల్లో ఒకరు. ఈ కుర్ర హీరో ఇప్పుడు పక్కా యాక్షన్ మూవీ ‘ఏజెంట్’తో బిజిగా ఉన్నారు. ఆగస్ట్ 12న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా తర్వాత అఖిల్ ఎవరితో సినిమా చేస్తారనే దానిపై పలు వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో తొలి సక్సెస్ అందుకు్న అఖిల్ దాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. దానికి తగ్గట్టు మారుతున్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ అఖిల్ ఓ బాలీవుడ్ దర్శక నిర్మాతతో కలిసి పనిచేయబోతున్నారని సమాచారం. ఇంతకీ అఖిల్ పనిచేయబోయే సదరు బాలీవుడ్ దర్శక నిర్మాత ఎవరో తెలుసా! కరణ్ జోహార్ అని సినీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. కరణ్ జోహార్‌తో సినిమా అంటే అది కేవలం బాలీవుడ్‌కే పరిమిత అవుతుందా? లేక మారుతున్న టాలీవుడ్ లెక్కను అనుసరించి తెలుగు, హిందీల్లో రూపొందించి మిగిలిన భాషల్లో సినిమాను విడుదల చేస్తారా? అని తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరణ్ జోహార్ లైగర్ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఆ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రూపొందించి మిగిలిన భాషల్లోకి అనువదించి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ సినిమాను కరణ్ జోహార్ కూడా అదే తరహాలో ప్లాన్ చేశారా? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. అయితే తాజాగా సినీ సర్కిల్స్ వినిపిస్తోన్న వార్తల మేరకు, అఖిల్‌తో కరణ్ జోహార్ చేయబోయే సినిమాలో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందట. జాన్వీ కపూర్ మంచి క్రేజీ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు ఇటీవల ఆమె తండ్రి బోనీ కపూర్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరణ్ జోహార్‌తో ఉన్న పరిచయం కారణంగా ఆమె అఖిల్ సినిమాలో నటించడానికి ఒప్పుకుందా? అనే విషయం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/HDeSO3u
No comments:
Post a Comment