సౌత్ స్టార్ హీరోయిన్ శెట్టికి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. సూపర్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకునే సమయం కూడా దొరకనంత బిజీ అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తూ అగ్ర కథానాయికగా మారారు. అరుంధతి సినిమాతో మైల్ స్టోన్ లాంటి సక్సెస్ అందుకున్న అనుష్క ఆ తర్వాత నుంచి ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ వస్తున్నారు. తన కోసమే కొత్త కథలు తయారవుతున్నాయి. అయితే, ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాల పరంగా బాగా వెనకబడిపోయారు. ఆమె నటించిన గత చిత్రం నిశ్శబ్ధం భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. దాంతో మళ్ళీ ఆమె కొత్త సినిమాను ప్రకటించలేదు. గత ఏడాది మళ్ళీ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నారు. ఈ సినిమాలో నవీల్ పొలిశెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే, మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రస్తుతం వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఇది ద్విభాషా చిత్రమట. గత ఏడాది దివంగత మాజీ ముఖ్యమంత్రి అమ్మ జయలలిత బయోపిక్ ఆధారంగా చిత్రాన్ని రూపొందించిన ఏ ఎల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఆయన చెప్పిన కథ అనుష్కకు బాగా నచ్చడంతో ఈ మూవీ చేసేందుకు ఆమె ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ - రానా - తమన్నా - రమ్యకృష్ణ లాంటి అగ్ర నటీ నటులతో కలిసి బాహుబలి సిరీస్‌లో నటించి అనుష్కకు పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో ఆమె ఓ కీల పాత్రను పోషించారు. కాగా, ఇప్పుడు తలైవి దర్శకుడితో అనుష్క కలిసి చేసేది నిజమే అయితే అది ఖచ్చితంగా పాన్ ఇండియా ప్రాజెక్టే అయుండొచ్చుననే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/vGZ5UJ1
No comments:
Post a Comment