మన మనసుకు ఎంతో దగ్గరైన, ఇష్టపడేవారు మనల్ని కలుసుకున్నప్పుడు మాటలు రావు. మనసంతా ఆనందంతో నిండిపోతుంది. ఎమోషనల్ కూడా అయిపోతుంటాం. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్ షణ్ముక్ జశ్వంత్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతకీ షణ్ముక్ తనకు ఇష్టమైన వ్యక్తిని ఎవరిని కలుసుకున్నాడు. దీప్తి సునయనను కలుసుకున్నాడా? ఇద్దరూ కలిసి పోయారా? అని అనుకుంటున్నారా? కాదండి బాబు.. తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సూర్య. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ఈ కథానాయకుడంటే షణ్ముక్‌కి ఎంతో ఇష్టం. తన తాజా చిత్రం ‘ఈటీ’తో ఈ నెల 10న ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆయన హైదరాబాద్ వచ్చి ఓ హోటల్లో దిగారు. అక్కడే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న షణ్ముక్ .. తన అభిమాన కథానాయకుడిని చూసి అలాగే ఆగిపోయాడు. హీరో సూర్య కూడా షణ్ముక్‌ను గమనించారు. ఆయన మీడియాతో మాట్లాడి వచ్చిన తర్వాత వెళ్లి ప్రత్యేకంగా వెళ్లి షణ్ముక్‌ను కలిశారు. సార్ నేను మీకు పెద్ద అభిమానిని అంటూ షణ్ముక్ చెప్పగా.. నిన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ సూర్య చెబుతూ షణ్ముక్‌ని కౌగిలించుకున్నారు. అభిమాన కథానాయకుడిని అనుకోకుండా కలుసుకోవడం. ఆయన కూడా షణ్ముక్‌ని చక్కగా రిసీవ్ చేసుకోవడంతో షణ్ముక్ చాలా ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. షణ్ముక్ ఎమోషనల్ కావడానికి గమనించిన హీరో సూర్య .. భుజం తట్టి గాడ్ బ్లెస్ యు అన్నారు. సూర్యతో తను ప్రత్యేకంగా దిగిన ఫొటోలు, వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన షన్ను ‘‘నువ్వు ఏం కావాలని కోరుకుంటావో అది దొరక్కపోవచ్చు. కానీ.. నీకు దక్కాల్సింది, అవసరమైనది తప్పకుండా దొరుకుతంది’’ అంటూ కొటేషన్ను కూడా షేర్ చేశారు. షన్ను ఫాలో వర్స్ ‘అన్నా నీ కల నిజమైంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 5లో పాల్గొన్న సమయంలో షణ్ముక్ విన్నర్ అయ్యే అవకాశాలున్నాయని అందరూ భావించారు. కానీ.. సిరితో హౌస్‌లో ఉన్న రిలేషన్ కారణంగా తనకు ఓటింగ్ తక్కువగా వచ్చి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో వైపు అప్పటి వరకు అతనికి అండగా నిలిచిన దీప్తి సునయన.. బ్రేకప్ చెప్పేసింది. బ్రేకప్ బాధ నుంచి ఇప్పుడిప్పుడే షన్ను బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/prDOwun
No comments:
Post a Comment