తాజాగా కొన్ని విషయాలను చెప్పింది. తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్, ట్రోల్స్, వంటి వాటిపై నోరు విప్పేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జాతీయ మీడియాతో మంచు లక్ష్మీ ముచ్చటించింది. తాను కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాని తెలిపింది. తాను మోహన్ బాబు కూతురిని, సినిమా ప్రపంచంలోనే పుట్టి పెరిగాను కదా? కాస్టింగ్ కౌచ్ ఎందుకు ఎదురువుతుందని అనుకున్నాను అంటూ మంచు లక్ష్మీ తెలిపింది. కానీ ప్రతీ ఇండస్ట్రీ, ప్రతీ రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, బ్యాంకింగ్, ఐటీ ఇలా అన్ని చోట్లా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని మంచు లక్ష్మీ తెలిపింది. నా ఫ్రెండ్స్ ఎందరో వాటి గురించి చెబుతుంటారు. ఇక బాడీ షేమింగ్, ట్రోల్స్ అయితే అందరికీ ఎదురవుతుంటాయి. ఎలా ఉన్నా కూడా ట్రోల్ చేస్తుంటారు. వాటిని పట్టించుకోకూడదు. మనకు నచ్చినట్టుగా మనం ఉండాలి.. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి అని మంచు లక్ష్మీ పేర్కొంది. అసలే ఈ జీవితం చాలా చిన్నది. అనుకున్నవి చేసేయాలి.. కోరుకున్నది సాధించుకోవాలి.. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.. ఎంతో సాధించాలి.. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పడం కూడా కష్టమే. ఈ ట్రోలింగ్, కాస్టింగ్ కౌచ్ ఇవేవీ కూడా మనల్ని ఆపకూడదు. మనం చేయాలనుకున్నది చేయాలి.. సాధించాలనుకున్నది సాధించాలి అంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ తమిళం, మళయాలంలో నటిస్తోంది. మళయాలంలో మోహన్ లాల్ హీరోగా వస్తోన్న మాన్‌స్టర్ సినిమాలో నటిస్తోంది. ఇక తమిళ సినిమా కోసం మంచు లక్ష్మీ పోలీస్ ఆఫీసర్‌గా మారింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/pOhEcXV
No comments:
Post a Comment