ప్రస్తుతం రామ్ చరణ్- దంపతులు టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం వరుస షూటింగ్‌లతో బిజీగా ఉంటున్న రామ్ చరణ్ కాస్త గ్యాప్ దొరకడంతో భార్య ఉపాసనతో కలిసి వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం వైఫ్‌తో కలిసి విదేశాల్లో విహరిస్తూ అక్కడి అందాలని ఆస్వాదిస్తున్నారు చెర్రీ. తాజాగా తమ ఫ్యామీలీ టూర్‌కి సంబంధించిన ఓ పిక్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది ఉపాసన. మంచు తివాచీ పరిచినట్టుగా ఉన్న ప్రదేశంలో ఉపాసనతో కలిసి రామ్ చరణ్ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందులో ఎల్లో కలర్ ట్రాక్ సూట్ వేసుకుని ఉపాసన కనిపిస్తుండగా జర్కిన్ ధరించి యమ స్టైల్‌గా కనిపిస్తున్నాడు చెర్రీ. ప్రస్తుతం ఈ జోడీ ఫిన్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తోంది. కాగా ఉపాసన షేర్ చేసిన ఈ ఫ్యామిలీ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసి హ్యాపీ మూమెంట్స్, ఎంజాయ్ అని కామెంట్స్ పెడుతూ తెగ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. రీసెంట్‌గా భారీ సినిమా కంప్లీట్ చేసిన రామ్ చరణ్.. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం సిద్ధమవుతున్నారు. మార్చి 25వ తేదీన ఈ సినిమాను గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు జక్కన్న. మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయి ప్రమోషన్స్ షురూ కానున్నాయి. ఈ గ్యాప్ లోనే టూర్ ఎంజాయ్ చేసి రావాలని ప్లాన్ చేసుకొని వెళ్లారట రామ్ చరణ్ దంపతులు. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించారు. ఈ పాన్ ఇండియా సినిమా కోసం యావత్ భారత దేశం ఆతృతగా ఎదురుచూస్తోంది. మరోవైపు బడా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా షెడ్యూల్స్‌తో రామ్ చరణ్ బిజీ అయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/V6lAPgw
No comments:
Post a Comment