సినీ ఇండస్ట్రీలో స్టార్స్ ప్రేమ, పెళ్లి విషయాలు నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తుంటాయి. స్టార్ హీరోహీరోయిన్స్ వ్యక్తిగత విషయాలపై మీడియా కన్ను ప్రతిక్షణం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓ ఇంటివారయ్యారని, బీటౌన్‌కి చెందిన ఓ హీరోయిన్‌తో సల్మాన్ ఖాన్ రహస్య వివాహం చేసుకున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. మరి మ్యాటర్ నిజమేనా? అయితే ఆ పెళ్లి ఎక్కడ జరిగింది? ఎందుకు రహస్య వివాహం చేసుకోవాల్సి వచ్చిందనేది చూద్దామా.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి విషయమై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. 56 ఏళ్ల వయసున్న ఈ స్టార్ హీరో ఇప్పటికే కొందరు హీరోయిన్లతో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచారు. అందులో చాలామంది హీరోయిన్లు పెళ్లి కూడా చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు. కానీ సల్మాన్ మాత్రం ఇప్పటికీ పెళ్లి పీటలెక్కలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సల్మాన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే మరో క్రేజీ విషయం జనాల్లో హాట్ టాపిక్ అయింది. సల్మాన్, సోనాక్షి ఉంగరాలు మార్చుకుంటున్న ఓ ఫొటో బయటకు రావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ షురూ అయ్యాయి. ఇంకేముంది ఇదిగో పులి అంటే అదిగో తోక అనేవారు రెచ్చిపోయారు. సల్మాన్ సీక్రెట్ మ్యారేజ్ అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వ్యాప్తి చేశారు. అయితే ఆ ఫొటోని పరీక్షించి చూస్తే అది మార్ఫింగ్ ఫొటో అని, రెండు ఫోటోలను ఒక్కచోట చేర్చి ఇలా ఎడిట్ చేశారని తెలుస్తోంది. ఇది పక్కా ఫేక్ ఫొటో అని, కొందరు కావాలనే ఇది క్రియేట్ చేశారు తప్ప సల్మాన్ పెళ్లి కాలేదని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాగా, సల్మాన్ ఖాన్‌తో కలిసి 'దబాంగ్' మూవీలో నటించింది. ఈ సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి.. ఆ తర్వాత బాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె 'శివం' అనే సినిమాలో నటిస్తుండగా.. సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాతో బిజీగా ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Me9RguJ
No comments:
Post a Comment