బ్యూటిఫుల్ సెలబ్రిటీ జోడీ అనుష్క శర్మ- కుటుంబానికి కొంతమంది వార్నింగ్స్ ఇస్తుండటం సినీ, క్రీడాభిమానుల్లో కలకలం సృష్టించింది. శృతిమించి విచక్షణ కోల్పోయి సభ్య సమాజం తలదించుకునేలా విరుష్క దంపతుల 10 నెలల కుమార్తెను టార్గెట్ చేయడం షాకింగ్ పరిణామం. చిన్నారి వామికపై అత్యాచారం తప్పదంటూ కొందరు హెచ్చరికలు ఇస్తుండటం ఆశ్చర్యకరంగా మారింది. ''విరాట్ కోహ్లీ, అనుష్క శర్మా.. మీరు సిగ్గుతో తలదించుకోవాలి.. మీ కూతురు ఫొటోలను ఎప్పుడెప్పుడు చూపిస్తారా.. ఎప్పుడు తనను రేప్ చేస్తానా అని ఎదురు చేస్తున్నా'' అంటూ ఓ ట్విట్టర్ ఖాతా నుంచి కోహ్లీకి పోస్ట్ రావడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఇలా వికృతపర్వం విలయతాండవం చేస్తుండటం సెన్సేషన్ అయింది. కోహ్లీపై ఉన్న కోపాన్ని ఆయన కుటుంబం, పదేళ్ల చిన్నారిపై చూపిస్తుండటం కన్నా సిగ్గుచేటు మరొకటి లేదని, మరీ ఇంత నీచానికి ఒడిగట్టడం సరికాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. టీ20 ప్రపంచకప్లో టీమిండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో కొందరు ఈ నీచానికి దిగజారారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓటమిని సహించలేని అభిమానులు సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. పేసర్ మహ్మద్ షమీపై మతపరమైన దూషణలకు పాల్పడటమే గాక.. కోహ్లీ భార్య, నటి సహా వారి కూతురు వామికను ఇందులోకి లాగి రచ్చ చేస్తున్నారు. గతంలో కూడా ఇండియా పేలవ ప్రదర్శన కనబర్చిన సమయంలో ఏ సంబంధం లేకుండా అనుష్కను ట్రోల్ చేసిన సందర్భాలున్నాయి. అయితే సోషల్ మీడియా వేదికగా ఇలాంటి దుర్భాషలాడుతూ చిన్నారిని రేప్ చేస్తామని బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. సైబర్ నేరాలను అరికట్టడంలో భాగంగా ఇలాంటి బెదిరింపులను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZLqxd7
No comments:
Post a Comment