వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ హీట్ ఎక్కడం ఖాయం. సాధారణంగా మూడు నాలుగు సినిమాలు పోటీ ఉంటాయి. ప్రేక్షకులను దాదాపు అన్ని సినిమాలు మెప్పిస్తాయి. అవి కూడా స్టార్ హీరోల సినిమాలే. అన్ని సినిమాలు పోటీ పడేంత స్కోప్ ఉంటుంది కాబట్టి స్టార్ హీరోలు సీజన్‌లో తమ సినిమాలను విడుదల చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. రానున్న సంక్రాంతికి ఇప్పటి నుంచే బరిలో దిగి పందెం కోళ్లలా పోటీ పడటానికి మన స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు స్కెచ్ వేసుకున్నారు. ఎన్నడూ లేనంత భారీ పోటీ ఈ సంక్రాంతికి కనిపిచనుందనేది కాదనలేని సత్యం. ఇప్పటికే RRR, భీమ్లానాయక్, సర్కారువారిపాట, రాధేశ్యామ్, బంగార్రాజు, ఎఫ్ 3 సినిమాలు పోటీలో ఉన్నాయి. ఇప్పుడు మరో హీరో ఈ పోటీలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. రాజశేఖర్. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా శేఖర్ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో విజయవంతమైన జోసెఫ్ చిత్రాన్ని తెలుగులో శేఖర్‌గా రీమేక్ చేస్తున్నారు. లలిత్ దర్శకుడు. ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వరుస హత్యలను చేధించడానికి డ్యూటీకి దూరమైన పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడనేదే కథ. అయితే ఇప్పటికే ఇన్ని భారీ చిత్రాలు మధ్యలో రాజశేఖర్ పోటీ పడితే ఆయనకు థియేటర్స్ దొరుకుతాయా? అనేది ప్రధానమైన ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఓ రేంజ్ భారీ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాల పోటీలో శేఖర్ సినిమా అనేది కనపడకుండా పోయే అవకాశం కూడా లేకపోలేదు. మరి రాజశేఖర్ ఇంత కష్టపడి.. ఓ మంచి సినిమాను చేస్తున్నారు. మంచి రిలీజ్ డేట్ చూసుకుంటే బావుంటుందనేది ఇండస్ట్రీలో కొందరి పలుకులు. మరి ఈ వార్తలపై రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం వచ్చే ఏడాది సంక్రాంతి లిస్టులో జనవరి 7న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ RRR విడుదలవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ సహా బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్స నటించిన చిత్రమిది. ఇక జనవరి 12న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా చేసిన భీమ్లానాయక్ విడుదలవుతుంది. జవనరి 13న సూపర్‌స్టార్ మహేశ్ సర్కారువారి పాట రానుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ జనవరి 14న వస్తుంది. వీటితో పాటు కింగ్ నాగార్జున బంగర్రాజు అంటూ కొడుకు చైతన్యతో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయడానికి రెడీ అయిపోయారు. మరోవైపు దిల్‌రాజు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో చేసిన ఎఫ్ 3తో నవ్వులను పూయించడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ గ్యాప్‌లో రాజశేఖర్ ఎక్కడ సందు చూసుకుని వస్తారో అర్థం కావడం లేదు మ
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31s1SuT
No comments:
Post a Comment