నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తన సినిమాల్లో బిజీగా మారడానికి వీలున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. ఫిట్‌నెస్ విషయంలో మరింత కేర్ తీసుకుంటుంది. స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు టూర్‌కి వెళ్లింది. పలు చిత్రాల్లో నటించడానికి ఓకే చెప్పింది. ఈ క్రమంలో సమంత త్వరలోనే బాలీవుడ్‌లోకి ప్రవేశించనుందని, హీరోయిన్ తాప్సీ ఈ సినిమాను నిర్మించబోతుందని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై సమంత రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. ’బాలీవుడ్‌లో సినిమాలు చేయాలనే ఆసక్తి నాకు ఉంది. మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తాను. ఇతర భాషల్లో సినిమా చేయాలంటే భాష ఒకటే సమాధానం కాదు. మంచి కథ, కథనం అవసరం. అలాగే ఆ పాత్రలో నేను నటించగలనా? పాత్రకు న్యాయం చేయగలనా? అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను’ అని తెలియజేసింది సమంత. అంటే సమంత ఎంట్రీ.. అది కూడా తాప్సీ ప్రొడక్షన్‌లో అనే వార్తల్లో నిజం లేదని మరోసారి తేలిపోయినట్లేగా. సమంత విషయానికి వస్తే.. చైతన్యతో వివాహం తర్వాత పరిమితంగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆమె విడిపోయిన తర్వాత వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. రెండు ద్విభాషా చిత్రాలకు ఒకే చెప్పింది. అందులో ఓ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్, మరో చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థల్లో చేస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ రెండు చిత్రాలను డెబ్యూ డైరెక్టర్స్ తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. ఆ లోపు సమంత తొలిసారి ఓ స్పెషల్ సాంగ్‌లో నటించబోతుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనల్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తుంది. ఈ సాంగ్ కోసం ఏకంగా సమంతకు కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్‌గా ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ సాంగ్ చిత్రీకరణను ఓ స్పెషల్ సెట్లో చేయబోతున్నారు. అల్లు అర్జున్‌తో ఇది వరకు సమంత సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అలాగే సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలంలో చరణ్ సరసన హీరోయిన్‌గా చేసింది. అలా బన్నీ, సుకుమార్‌తో ఉన్న మంచి అనుబంధంతో పుష్ప ది రైజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఓకే చెప్పింది. స్పెషల్ సాంగ్స్‌చేయడంలో సుకుమార్‌కి ఓ ప్రత్యేకత ఉంది. మరి ఈసారి సమంత సుక్కు ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి మరి. పుష్ప ది రైజ్ పాన్ ఇండియా మూవీ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nEdrHV
No comments:
Post a Comment