అదేంటో.. ఒక్కోసారి ఊహించని సంఘటనలు సడెన్ షాకిస్తుంటాయి. తాజాగా విడుదలైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో వీడియోలో అదే జరిగింది. జడ్జ్ స్థానంలో కూర్చున్న కోపంతో ఊగిపోయాడు. ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ కనిపించే ఆయన ఒక్కసారిగా సీటులోంచి లేచి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సీన్ చూసి అంతా షాకవుతున్నారు. మరి అసలు మ్యాటర్ ఏంటి? మనో కోపానికి కారణం ఎవరు? అనే దానిపై ఓ లుక్కేద్దామా.. ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ గత కొన్నేళ్లుగా బుల్లితెరపై వినోదాలు పంచుతున్నారు. ఈ షో చూసి క్షణం ఆపుకోకుండా నవ్వుకోవడమే తప్ప వేరే ఏదీ తెలియని ప్రేక్షకులను తాజాగా మనో ఆశ్చర్యపర్చాడు. నవంబర్ 5న టెలికాస్ట్ కాబోతున్న షో తాలూకు ప్రోమో రిలీజ్ చేయగా.. అందులో కామెడీకి తోడు ట్రాజెడీ కూడా కనిపించింది. జడ్జ్ స్థానంలో ఉండే మనో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్‌పై విరుచుకుపడ్డ సీన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. షోలో భాగంగా తన స్కిట్ ఫినిష్ చేశాడు. అయితే ఈ స్కిట్ అయిపోయిన జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. రాకేష్.. నువ్వంటే నాకు ఎంత గౌరవం అయ్యా.. ఏంటిది? పద్దతేనా.. ఇది ఏ స్టేజీ.. మీరు చేస్తున్నది ఏంటి? అంటూ సీటులో నుంచి లేచి కిందకు దిగిన మనో, రాకేష్‌పై చేయిచేసుకోబోయాడు. మనో గారు అంటూ అంటున్నా పట్టించుకోకుండా జడ్జ్ సీటు నుంచి దిగి వెళ్ళిపోయాడు మనో. అలాగే ఐ యామ్ సారీ సార్ అంటూ రాకేష్ ప్రాధేయపడినా మనో లోని కోపం చల్లారలేదు. ఇదంతా చూసిన రోజా ఒక్కసారిగా షాకైపోయింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడమే గాక జనాల్లో చర్చనీయాంశం అయింది. చూడాలి మరి ఇది జబర్దస్త్ స్కిట్‌లో భాగంగా చేశారా?లేక నిజంగానే జరిగిందా అనేది. సో.. నవంబర్ 5 వరకు వెయిట్ అండ్ సీ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZS9OoP
No comments:
Post a Comment