సూపర్‌స్టార్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ‘‘నా చికిత్స పూర్తయ్యింది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగు పడాలని ప్రార్థనలు చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అన్నారు. మూడు రోజుల ముందు రజినీకాంత్‌కు తలనొప్పిగా ఉందనిపించడంతో ఆయన్ని కావేరి హాస్పిటల్‌లో జాయిన్ చేయించారు. అక్కడ వైద్యులు ఆయన్ని పరిశీలించి మెదడులోని నరాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించి చికిత్స అందించారు. కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. డాక్టర్స్ సూచన మేరకు వైద్య నిపుణుల పర్యవేక్షణలో రజినీకాంత్‌కు కరోటిడ్ ఆర్టరీ రివాస్కులైజేషన్ శస్త్ర చికిత్స పూర్తయ్యింది. రెండు రోజుల పాటు హాస్పిటల్‌లోనే రెస్ట్ తీసుకున్న రజినీకాంత్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు. ఈ మద్యనే గత వారమే రజినీకాంత్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి స్వీకరించారు. మరోవైపు ఆయన లేటెస్ట్ మూవీ అన్నాత్త(పెద్దన్న) దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. తలైవర్ అభిమానులు సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో రజినీకాంత్‌కు అనారోగ్య సమస్యలు రావడంతో వారిలో కంగారు మొదలైంది. అయితే ఆయన శస్త్ర చికిత్స తర్వాత ఇంటికి చేరుకోవడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. వయో భారంతో రజినీకాంత్‌కు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఎమెసిస్, బ్రాంకైటిస్ వంటి సమస్యలతో రజినీ చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఏడాది అమెరికాలో రెగ్యులర్‌గా చికిత్స చేయించుకుంటూనే ఉన్నారు. ఒకానొక దశలో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకున్నారు. అన్నీ సిద్ధం అవుతున్న సందర్భంలో గత ఏడాది డిసెంబర్‌లో ఉన్నట్లుండి సీరియస్‌గా అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. అప్పుడాయన షూటింగ్ చేస్తున్నారు. అయితే సినిమాకు బ్రేక్ వేసి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు తలైవర్. అటు పిమ్మల డాక్టర్స్ సలహా మేరకు ఆరోగ్య పరిస్థితుల రీత్యా, రజినీకాంత్ రాజకీయాల్లోకి రానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి సినిమాల విషయంలో రజినీకాంత్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే కొందరు దర్శకులు ఆయనతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZEjnrv
No comments:
Post a Comment