IPL : సింగర్ సునీత, సిద్ శ్రీరామ్‌ల గాత్రం.. వివి వినాయక్ సాయం

సింగర్ సునీత, సిధ్ శ్రీరామ్‌లు కలిసి పాడితే ఆ పాట ఎలా ఉంటుంది.. ఎంత హిట్ అవుతుందనేది ఇది వరకే చూశాం. నీలి నీలి ఆకాశం అంటూ యూట్యూబ్‌ను షేక్ చేశారు. మరోసారి , సిధ్ శ్రీరామ్‌లు కలిసి ఓ పాటను ఆలపించారు. బీరం వరలక్ష్మి సమర్పణలో, అంకిత మీడియా హౌస్ బ్యానర్ పై విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఐపీఎల్ (IPL). ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ ఆవిష్కరించారు. వెంగి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను ప్రముఖ గాయకులు సిద్ శ్రీరామ్, సునీత ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదల అయ్యింది. ఈ సందర్భంగా దర్శకులు వి వి వినాయక్ మాట్లాడుతూ..సిధ్ శ్రీరామ్ సునీత ఆలపించిన ఈ పాట చాలా బాగుంది. సంగీత దర్శకుడు వెంగీ సంగీతం బాగుంది.చిత్ర దర్శకుడు సురేష్ , నిర్మాత బీరం శ్రీనివాస్ చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్ అన్నారు. మొదటి సాంగ్‌ను వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా సంతోషం వుందని డైరెక్టర్ సురేష్ లంకలపల్లి అన్నాడు. ఈ ప్రాజెక్ట్ యాక్ట్ చేయడం చాలా హ్యాపీ గా వుందని హీరో విశ్వ కార్తికేయ అన్నాడు. మా ఐపిఎల్ టీమ్‌ను ఆశీర్వదించిన వినాయక్‌కి నిర్మాత బీరం శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి,సుమన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cwz8TY

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts