సినిమా అనేది బయటకు కనిపించే రంగుల ప్రపంచమే అయినా నటీనటులు ఎన్నో ఎడిదొడుకులు ఎదుర్కొంటే గానీ షైన్ కాలేరు. కాస్టింగ్ కౌచ్ మొదలుకొని మేల్ డామినేషన్ వరకు అన్నీ ఇక్కడ ఉంటాయని ఇప్పటికే ఎందరో నటీనటులు ఓపెన్ అయ్యారు. ఇదే క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల గురించి మాట్లాడుతూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో పురుషాధిక్యత గురించి మాట్లాడిన తాప్సి.. హీరోయిన్లకు పేరొచ్చే సినిమాల్లో నటించేందుకు చాలా మంది హీరోలు ఇష్టపడరని చెబుతూ గతంలో తన సినిమా విషయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి చెప్పింది. ఓ సినిమాలో తనది డబుల్ రోల్ కాగా హీరోగా ఓ స్టార్ నటుడిని సంప్రదించగా ఆయన ఒప్పుకోలేదని, అతను అంతుకుముందే తనతో ఒక సినిమాలో నటించినా కూడా ఈ సినిమాకు ఓకే చెప్పలేదని తెలిపింది. ఒకట్రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదని, ఇండస్ట్రీలోని హీరోలు అలా ఫీల్ కావడం బాధాకరమని చెప్పుకొచ్చింది. హీరోయిన్ రోల్ ప్రియార్టీ ఉందనే కారణంగానే ఆ హీరోలు సున్నితంగా రిజెక్ట్ చేశారని పేర్కొంటూ సంచలన విషయాలు ప్రస్తావించింది తాప్సి. 'ఝుమ్మంది నాధం' సినిమాతో తెలుగు తెరపై కాలుమోపిన తాప్సీ.. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను చేస్తూ ఫుల్ పాపులారిటీ కూడగట్టుకుంది. ఒకానొక సమయంలో అగ్ర కథానాయికలలో ఒకరిగా నిలిచింది. ఇక టాలీవుడ్ అవకాశాలు కాస్త సన్నగిల్లడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన తాప్సీ అక్కడే హవా నడిపిస్తోంది. సినిమాలతో పాటు డిజిటల్ రంగంలోనూ సత్తా చాటుతోంది. నటిగా, నిర్మాతగా పలు సినిమాలు రూపొందిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. రీసెంట్‌గా సమంతతో ఆమె ఓ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k4ZgcO
No comments:
Post a Comment