లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి వారసుడు రానా దగ్గుబాటి కెరీర్ ప్రారంభం నుంచి తెలుగుకే పరిమిత కాలేదు. తమిళ, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ యాక్టర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు బాహుబలి వల్ల గుర్తింపు పాన్ ఇండియా రేంజ్‌లో మరింత పెరిగింది. దీంతో రానా ఇప్పుడు తన సినిమాలను మరింత జాగ్రత్తగా ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం రానా హీరోగా నటించిన చిత్రాల్లో విరాటపర్వం ఒకటి. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో రానా నక్సలైట్ నాయకుడు రవన్న పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సురేశ్ బొబ్బిలి ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ప్రారంభించాయి. అయితే ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అనుకున్న రానా దగ్గుబాటి సురేశ్ బొబ్బిలి ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయాడని పెట్టిన ట్వీట్‌కు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు. ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది అంటూ విరగబడి నవ్వుతున్న రెండు సింబల్స్‌ను పోస్ట్ చేశారు. ఇంకే ముంది. రానా ఎప్పుడైతే రిటార్ట్ ఇచ్చాడో ఆయన ఫ్యాన్స్, నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. సినిమాల గురించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న వారికి ఇలాగే రిప్లయ్ ఇవ్వాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరైతే మీరు రియాక్ట్ కావడం వల్లనే ఈ ట్వీట్‌కు అంత ప్రాముఖ్యత వచ్చిందని కూడా అన్నారు. ఇక విరాటపర్వం సినిమా విషయానికి వస్తే నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి, డి.సురేశ్‌బాబు నిర్మాతలు. డిఫరెంట్ లవ్‌స్టోరీగా సినిమా రూపొందుతోంది. దీంతో పాటు రానా చేస్తున్న మరో చిత్రం భీమ్లా నాయక్. ఇందులో పవన్‌కళ్యాణ్‌తో కలిసి ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు డానియల్ శేఖర్. రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతుంది. దీంతో పాటు రానా హీరోగా మిలింద్ రావ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అది కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mCUjcS
No comments:
Post a Comment