ఒకానొక సమయంలో తెలుగు తెరను తన అందాలతో షేక్ చేసింది గోవా బ్యూటీ . 'దేవదాసు' సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరో రామ్‌తో రెచ్చిపోయి నటించింది. అప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు చూసిన అందాలకు కొత్త రూపమిస్తూ తన నాజూకు అందాలతో హల్చల్ చేసింది. అలా మొదటి సినిమాతోనే యూత్ ఆడియన్స్‌ని పులకరింపజేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని బాలీవుడ్ బాట పట్టింది. ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై అంతగా కనిపించకపోయినా సోషల్ మీడియా వేదికగా అందరితో టచ్‌లో ఉంటోంది ఇల్లీ బేబీ. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాలో బోరున ఏడ్చేసింది ఇలియానా. అంతేకాదు ఏడవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని ఆమె అంటోంది. మరి ఈ ఏడుపుకి కారణం ఏంటంటే.. వంట చేయడానికి కూరగాయలు తరుగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి చాలా పదునుగా ఉండటం వల్ల పొరపాటున గాయం అయిందట. ఈ విషయాన్ని చెబుతూ తన రెండు వేళ్లకు గాయం కావడంతో చిన్నపిల్లలా ఏడ్చేశానని ఇలియానా పేర్కొంది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్లు ఆమెను పెళ్లిపై ప్రశ్నించారు. దీంతో ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది ఇలియానా. తనకు కూడా త్వరగా చేసుకోవాలని ఉందని చెబుతూనే.. తనకు కావాల్సిన విధంగా ఉండే వరుడు దొరకడం లేదంటూ హాట్ కామెంట్ వదిలింది. పెళ్లి విషయంలో ఇలియానా ఇలా ఓపెన్ కావడంతో నెటిజన్స్ మరింత రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఓ విదేశీ ఫోటో గ్రాఫర్‌తో ప్రేమాయణం నడిపి సహజీవనం కూడా చేసింది ఇలియానా. ఆ తర్వాత కొన్ని కారణాలతో అతడితో బ్రేకప్ చేసుకొని ఒంటరిగా ఉంటోంది. ఈ విషయమై గతంలో రియాక్ట్ అయిన ఇల్లీ బేబీ.. బ్రేకప్ తర్వాత చాలా కాలం పాటు డిప్రెషన్‌లో ఉన్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి పెళ్లి టాపిక్‌పై ఇలియానా రియాక్ట్ కావడంతో అందరి దృష్టి ఆమె పెళ్లిపై పడింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BrLXZO
No comments:
Post a Comment