జబర్దస్త్ కమెడియన్‌గా స్టార్ హీరోల రేంజ్ పాపులారిటీ కూడగట్టుకున్నాడు . మాట మాటకు పంచ్ వేస్తూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసే ఆయన.. తాజాగా తన పర్సనల్ విషయాలపై ఓపెన్ అయ్యాడు. చదువు పూర్తయ్యాక ఒకానొక సమయంలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే జరిగిన చేదు అనుభవాన్ని వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదువులు, ఉద్యోగాలు తనకు సెట్ కావని నమ్మిన ఆది, సొంత టాలెంట్ ఉపయోగించి ఈ స్టేజ్‌కి వచ్చాడు. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో చదువు- ఉద్యోగం- సంపాదన విషయమై ఓ స్కిట్ వేశారు. దీంతో తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. బీటెక్ చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్లిన ఓ యువకుడికి అక్కడ ఇంగ్లీష్ రాదని చిన్నచూపు చూసిన స్కిట్ వేసి ఓ విలువైన మెసేజ్ ఇచ్చాడు ఆది. తెలుగు వాళ్లమై ఉండి.. ఇక్కడ ఇంగ్లీష్ రాకపోతే ఉద్యోగం ఇవ్వకపోవడం ఏంటో నాకు ఆ రోజు అర్థం కాలేదు. కానీ ఆ రోజు ఆ ఇంటర్వ్యూ చేసిన వాడికి చెబుతున్నా.. మీరు తెలుగులో మాట్లాడుతున్నాననే కారణంతో నాకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఈ రోజు ఆ తెలుగు వల్లే మీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నా.. థాంక్యూ. తెలుగులో మాట్లాడేవాళ్లకే ఉద్యోగం ఇచ్చే సంస్థను ఎప్పటికైనా పెడతాను. తెలుగులోనే మాట్లాడుకుంటూ జాబులు క్రియేట్ చేస్తాను. వాళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ సంపాదించేలా నేను చేస్తాను అని చెప్పాడు హైపర్ ఆది. గతంలో కూడా హైపర్ ఆది చదివిన బీటెక్ చదువు, ఉద్యోగం తదితర అంశాల గురించి ఎన్నో వార్తలు చూశాం. బ్యాచ్‌లర్ రూంలో కష్టాలు పడుతూ ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఆది లైఫ్ టర్న్ చేసింది కృష్ణకాంత్ పార్క్. ఏదో ఆట విడుపు కోసం చేసిన స్ఫూప్, అందులో రాసుకున్న డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. అది చూసి అధిరే అభి.. ఆదికి జబర్దస్త్ అవకాశం ఇచ్చాడు. అది మొదలు ఎక్కడా వెనుతిరిగి చూడలేదు ఈ జబర్దస్త్ కమెడియన్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CIj3VO
No comments:
Post a Comment