బుల్లితెరపై భారీ డిమాండ్ ఉన్న షోల్లో ఒకటి. కొన్నేళ్లుగా ఈ షో హవా నడుస్తోంది. ఈ వేదికగా సెలబ్రిటీలతో సరదాగా ముచ్చటిస్తూ ప్రేక్షకుల కావాల్సిన సమాచారాన్ని లాగుతుంటారు కమెడియన్ ఆలీ. సీనియర్, జూనియర్ అనే తేడాలేకుండా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేస్తూ వారి వారి పర్సనల్ విషయాలు రాబట్టడం స్టైల్. మరి ఇలాంటి వేదికపై లెజండరీ కమెడియన్ సందడి చేస్తే ఎలా ఉంటుంది. ఆ హంగామాకు ఎంతో సమయం లేదు. తాజాగా రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పారు. ఈ వీడియోలో ఆలీ, బ్రహ్మానందం ఇద్దరూ కలిసి కాలు కడపడంతో బుల్లితెర ప్రేక్షకలోకం ఫిదా అయింది. కింగ్ ఆఫ్ కామెడీ అంటూ బ్రహ్మానందంకు సాదర స్వాగతం పలికారు ఆలీ. దీంతో ఇన్నాళ్లుగా ఎంతోమంది చేస్తున్న రిక్వెస్టులకు మోక్షం కలిగింది. లెజండరీ కమెడియన్లు ఆలీ, బ్రహ్మానందంలను ఒకే తెరపై చూసి ప్రేక్షకలోకం హుషారెత్తిపోతోంది. కాగా ఆలీతో సరదాగా అన్ని ప్రోమోల్లో లాగా కాకుండా ఈ ప్రోమో కాస్త డిఫరెంట్‌గా కట్ చేశారు. బ్రహ్మానందం వస్తున్నాడంటే సెటప్ ఎలా ఉంటుంది.. ఎంట్రీ ఎలా ఉంటుందనేది అందరూ ఊహించుకోగలరు. అంతకు మించి అనేలా ఈ వీడియోలో చూపించారు. ఆలీ, బ్రహ్మానందం ముచ్చట్లపై ఏ మాత్రం హింట్స్ ఇవ్వకుండా ఆసక్తి రేకెత్తించారు. కేవలం 44 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఫుల్ ఎపిసోడ్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30K0XFL
No comments:
Post a Comment