అడివి శేష్ ‘మేజర్‌’ రిలీజ్ డేట్‌పై సూపర్ స్టార్ మహేశ్ క్రేజీ అనౌన్స్‌మెంట్!

అడివిశేష్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మేజ‌ర్‌’. 26/11 జ‌రిగిన ముంబై ఉగ్ర‌వాద‌ దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను కాపాడిన ఎన్ఎస్‌జీ క‌మెండో ఉన్ని కృష్ణ‌న్ పాత్ర‌ను ఈ చిత్రంలో అడివిశేష్ పోషిస్తున్నారు. కేవ‌లం ముంబై దాడుల నేప‌థ్యంతోనే కాకుండా ఉన్ని కృష్ణ‌న్ జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్క‌రిస్తున్నారు. ఈ సినిమాను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యాన‌ర్‌పై ఏ ప‌స్ల్ ఎస్ మూవీస్‌, సోనీ పిక్చ‌ర్స్ వారి స‌హ‌కారంతో నిర్మిస్తున్నారు. శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా ఆగుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. సినిమాను వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 11న మూడు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్న‌ట్లు హీరో మ‌హేశ్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించ అస‌లు షూటింగ్ ఎలా చేశారని తెలియ‌జేస్తూ మ‌హేశ్ ఓ ప్రోమోను విడుద‌ల చేశారు. మేజ‌ర్ సినిమా షూటింగ్‌ను గ‌త ఏడాది జ‌న‌వ‌రి 19న ప్రారంభించారు. 120 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఈ మ‌ధ్య‌లో కోవిడ్ రెండు వేవ్స్‌ను ఫేస్ చేసింది. 75 లొకేష‌న్స్‌లో మూవీని షూట్ చేశారు. దీని కోసం 8 భారీ సెట్స్ వేశారు. మూడు భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ముంబై గే వే ఆఫ్ ఇండియ‌, ఎన్ఎస్‌జీ క‌మెండోస్ ఉండే ప్రాంతానికి సంబంధించిన సెట్‌, తాజ్ హోట‌ల్ ప్యాలెస్ సెట్ సినిమాకే హైలైట్‌గా నిల‌వ‌నుంది. దాదాపు ఐదు వంద‌ల మంది ఈ సెట్‌ను వేయడానికి రేయంబ‌గ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. తాజ్ హోట‌ల్స్ వాళ్లు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ హోట‌ల్‌లో స్టే చేస్తూ వారికి తెలియ‌కుండా అబ్జ‌ర్వ్ చేసి సెట్‌ను రూపొందించారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. స‌యూ మంజ్రేక‌ర్‌, శోభితా దూళిపాళ, ప్ర‌కాశ్ రాజ్‌, రేవ‌తి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క్ష‌ణంతో హీరోగా తొలి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న హీరో అడివి శేష్‌, ఆ త‌ర్వాత గూఢ‌చారితో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఇక ఎవ‌రుతో మ‌రో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టి అంద‌రినీ త‌న‌వైపు తిరిగేలా చేసుకున్నారు. ఈ క్ర‌మంలో మేజ‌ర్ ప్రాజెక్ట్ చేయాల‌నుకోవ‌డం.. దానికి మ‌హేశ్ ఇత‌ర నిర్మాత‌లు అండ‌గా నిల‌వ‌డంతో ప్రాజెక్ట్‌ను అనుకున్న దాని కంటే ఇంకా బెట‌ర్‌గా చేసుకుంటూ వ‌చ్చారు. దీని త‌ర్వాత గూఢ‌చారి 2 సినిమాను చేయ‌డానికి రెడీ అవుతారు అడివిశేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bzw6hp

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts